For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bheemla Nayak నుంచి ఆ హీరోయిన్ ఔట్: బంపర్ ఆఫర్ పట్టేసిన మలయాళీ బ్యూటీ

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో రీమేక్ మూవీలు వస్తున్నాయి. అయితే, ఈ మధ్య కాలంలో అలాంటి చిత్రాల సంఖ్య మరింత ఎక్కువైంది. దీంతో పలు భాషల చిత్రాలు మన దగ్గర హవాను చూపిస్తున్నాయి. వేరే భాషల్లో సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాలను మన దర్శక నిర్మాతలు తీసుకొచ్చి సరికొత్తగా తెరకెక్కిస్తున్నారు. వీటిని చిన్న హీరోలతో పాటు బడా స్టార్లతోనూ చేయిస్తున్నారు. ఇలా ఇప్పటికే ఎన్నో రీమేక్ మూవీలు తెలుగులోకి వచ్చాయి. మరికొన్ని చిత్రీకరణ దశలో ఉన్నాయి. అలాంటి వాటిలో మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోషియం'కు రీమేక్‌గా వస్తున్న 'భీమ్లా నాయక్' ఒకటి.

  బూతులతో రెచ్చిపోయిన శ్రీరెడ్డి: ఆ శృంగారం ఎలా చేస్తారో వివరిస్తూ వీడియో.. అక్కలు, ఆంటీల కోసమే అంటూ!

  భారీ మల్టీస్టారర్‌గా రాబోతున్న 'భీమ్లా నాయక్' మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరుతో నడిచే కథతో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను విలక్షణ చిత్రాల దర్శకుడిగా పేరొందిన సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయింది. అయితే, మధ్యలో అనుకోని అవంతరాలు రావడంతో పలుమార్లు బ్రేక్ వచ్చింది. ఇక, ఇటీవలే దీన్ని పున: ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఏకధాటిగా ఈ సినిమా చిత్రీకరణను జరుపుతున్నారు. దీంతో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది.

  Samyuktha Menon Replace Aishwarya Rajesh for Bheemla Nayak

  ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'భీమ్లా నాయక్' మూవీలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు జోడీగా టాలెంటెడ్ బ్యూటీ నిత్య మీనన్ నటిస్తోన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. అయితే, దగ్గుబాటి రానాకు జోడీగా ఎవరు నటిస్తున్నారన్న దానిపై క్లారిటీ రాలేదు. కానీ, ఈ పాత్రకు ఐశ్వర్య రాజేష్‌ను తీసుకున్నారన్న టాక్ వినిపించింది. అయితే, తాజాగా దీని గురించి ఓ ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ నటించడం లేదట. డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడమే దీనికి కారణం అని తెలుస్తోంది.

  Bigg Boss: పర్సనల్ విషయాలపై లేడీస్ పచ్చి మాటలు.. వాడుకుని వదిలేయ్ అంటూ ఆమెతో దారుణంగా!

  'భీమ్లా నాయక్' మూవీలో రానా సరసన నటించే హీరోయిన్ గురించి మరో న్యూస్ తాజాగా ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. ఈ పాత్ర కోసం మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్‌ను తీసుకున్నారట. ఇప్పటికే చిత్ర యూనిట్ ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలుస్తోంది. భారీ చిత్రం కావడంతో ఇందులో నటించేందుకు సంయుక్త వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇక, అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోతుందనే టాక్ వినిపిస్తోంది. సంయుక్త విషయానికి వస్తే.. ఆమె మలయాళంలో 'తీవండి', 'కల్కి', 'ఆనుమ్ పెనుమ్' సహా ఎన్నో చిత్రాల్లో నటించింది.

  క్రేజీ కాంబినేషన్‌లో రూపొందుతోన్న 'భీమ్లా నాయక్' మూవీని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం ఇస్తున్నాడు. దీని నుంచి ఇప్పటికే టైటిల్ గ్లిమ్స్ వీడియోతో పాటు ఓ పాట కూడా విడుదలైంది. వీటికి భారీ స్థాయిలో స్పందన కూడా వచ్చింది. దీంతో ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. ఇక, ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పోలీస్‌గా, రానా లోకల్ డాన్‌గా నటిస్తున్నారు.

  English summary
  Pawan Kalyan, Rana Daggubati Doing Bheemla Nayak Movie Under Saagar K Chandra Direction. Samyuktha Menon Replace Aishwarya Rajesh for This Movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X