త్రిషతో పబ్లిక్‌గా చెట్టాపట్టాల్.. నీ అభిమానిగా తట్టుకోలేకపోతున్నా... దళపతి విజయ్‌పై హీరోయిన్ ఆగ్రహం
కోలీవుడ్ సూపర్‌స్టార్, టీవీకే అధినేత దళపతి విజయ్ కుటుంబ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతోంది. విజయ్ భార్య సంగీత విడాకుల నోటీస్ నేపథ్యంలో త్రిషతో ఆయన పబ్లిక్‌గా జంటగా కనిపించడం వివాదాస్పదమైంది. ఇప్పటి వరకు త్రిషతో రిలేషన్‌పై రూమర్స్ అనుకున్న వారందరికీ ఆయన నిర్ణయం షాకిచ్చింది. నిజంగానే త్రిషతో ఉన్న బంధాన్ని విజయ్ ఇలా బయటపట్టేశారా? భార్యకు విడాకులు ఇచ్చేందుకు విజయ్ సిద్ధమయ్యారా అంటూ తమిళ సినీ, రాజకీయ వర్గాలు, ప్రజలు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ప్రవర్తనపై కోలీవుడ్ నటి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
సదరు నటి ఎవరో కాదు.. హీరోయిన్ సనమ్ శెట్టి. కాంట్రవర్సీకి మారుపేరుగా నిలుస్తుంటారు తమిళ నాటి సనమ్ శెట్టి. ఎవరు ఏమనుకున్నా సరే .. ఉన్నది ఉన్నట్లు ముఖంపై కొట్టినట్లు మాట్లాడే ఈ అమ్మడు మీడియా ముందుకు వచ్చినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అవి హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటాయి. బిగ్‌బాస్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకుని ఆ ప్రోగ్రామ్‌పైనే సంచలన వ్యాఖ్యలు చేసింది సనమ్. ఈ షోలో పాల్గొనడం వల్ల తన కెరీర్‌కు ఎలాంటి ఉపయోగం లేదని, అవకాశాలు పరిగెత్తుకుంటూ రాలేదని సనమ్ ఆరోపించింది. బిగ్‌బాస్ తర్వాత తనకు వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా వచ్చిన లాభమేమీ లేదని ఆమె వ్యాఖ్యానించింది.

తమిళ బిగ్‌బాస్‌తో పేరు తెచ్చుకున్న సనమ్ శెట్టి తెలుగులో శ్రీమంతుడు, ప్రేమికుడు, సింగం, 123 చిత్రాల్లో నటించింది. ఇక దళపతి విజయ్‌కి తొలి నుంచి వీరాభిమాని అయిన సనమ్ శెట్టి. ఆయనపై ఈగ వాలనివ్వదు. విజయ్ పుట్టనరోజు సందర్భంగా ఆయనకు విభిన్నంగా శుభాకాంక్షలు చెప్పడంతో పాటు దళపతిని ఎవరైనా ఏమైనా అంటే ఘాటుగా బదులు ఇస్తుంది. కొద్దిరోజుల క్రితం కరూర్‌లో విజయ్ రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటతలో 42 మంది చనిపోవడంతో దళపతిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. సీబీఐతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనపై కేసులు నమోదు చేసింది. అయితే సనమ్ శెట్టి మాత్రం విజయ్‌కి మద్ధతుగా మాట్లాడింది.
గత కొంతకాలంగా దళపతి విజయ్ వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ మీడియాతో మాట్లాడుతూ.. త్రిషతో బంధాన్ని తెంచుకుని బయటకు వస్తేనే విజయ్‌కి వాస్తవాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు తమిళనాట కలకలం రేపాయి. ఆ తర్వాత కొద్దిరోజులకే విజయ్ సతీమణి సంగీత సైతం తన భర్తకు ఓ కోలీవుడ్ నటితో అక్రమ సంబంధం ఉందని విడాకుల నోటీసులో పేర్కొంది. దీంతో ఇప్పుడు అందరి వేళ్లూ త్రిషపైనే చూపిస్తున్నాయి. ఈ ఆరోపణలప త్రిష, విజయ్ మౌనంగానే ఉన్నారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా చెన్నైలో జరిగిన ఓ నిర్మాత కుమారుడి వెడ్డింగ్ రిసెప్షన్‌కు విజయ్ - త్రిష జంటగా వెళ్లడం ఈ ఆరోపణలకు, ఊహాగానాలకు బలాన్ని చేకూర్చింది. వీరిద్దరూ పరోక్షంగా ఇలా తమ బంధాన్ని బయటపెట్టారా అంటూ తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
దాంతో విజయ్ - త్రిషలపై నెటిజన్లు మండిపడుతున్నారు. తాజాగా సనం శెట్టి కూడా ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించింది. విజయ్- త్రిషలు పెళ్లికి వెళ్లిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఆమె.. ఇది కరెక్ట్ కాదు. భార్య బాధను ఏమాత్రం పట్టించుకోకపోవడం దారుణం. మిమ్మల్ని ఎన్నో ఏళ్లుగా అభిమానిస్తున్న మా లాంటి అభిమానులను మీరు తీవ్రంగ నిరాశపరిచారు అంటూ సనం శెట్టి రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కొందరు విజయ్ అభిమానులు దీనికి మద్ధతుగా, మరకొందరు మాత్రం వ్యతిరేకంగా కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











