రెండే నిముషాల్లో అర్జున్ రెడ్డి కథ చెప్పేసిన సందీప్ రెడ్డి వంగా..ఇప్పటిదాకా గుర్తు పట్టలేదట..ఎక్కడో గమనించారా
అర్జున్ రెడ్డి సినిమా తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ అంత పేరు రాకపోయినా సందీప్ రెడ్డి వంగాకి కూడా ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఇదే సినిమాను హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేయగా అక్కడ కూడా సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా కథ మొత్తాన్ని సినిమా స్టార్టింగ్ లో రెండు నిమిషాలలో ప్రేక్షకులకు అర్థం అయ్యేలాగా చెప్పేశాడట సందీప్ రెడ్డి వంగా. అయితే ఈ విషయం ఇప్పటికీ ప్రేక్షకులకు అర్థం కాలేదు కానీ ఒక నెటిజన్ కు అర్థం అయింది అంటూ సందీప్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే

రిస్క్ చేసి హిట్
అప్పటికే పెళ్లిచూపులు లాంటి క్లీన్ సబ్జెక్టు సినిమా చేసి హిట్ కొట్టాడు విజయ్ దేవరకొండ. తర్వాత సందీప్ రెడ్డి వంగా అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో అర్జున్ రెడ్డి అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా విడుదలైన తర్వాత మొదటి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని మొత్తానికి ట్రెండ్ సెట్టర్ గా నిలిచి ఇప్పటికీ ఈ సినిమా ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
రెండే నిముషాల్లో
ఈ సినిమాలో కేవలం రెండే నిమిషాల్లో కథ మొత్తం ప్రేక్షకులకు అర్థం అయ్యేలాగా చెప్పాడట సందీప్ రెడ్డి వంగా. కథ ప్రారంభంలో అర్జున్ రెడ్డి గురించి అర్జున్ రెడ్డి నాన్నమ్మ తన స్నేహితురాలికి చెబుతుంది. అలా చెబుతున్న సమయంలో ఒక చిన్న బొమ్మ గురించి చెబుతున్నట్లు కనిపించినా సరే సినిమా కథ మొత్తం ఆ రెండే నిమిషాలు బామ్మ మాటల్లో అర్ధమయ్యేలాగా చెప్పాడు సందీప్ రెడ్డి వంగ.

ఎన్ని సార్లు చూసినా
అయితే ఎన్నో సార్లు సినిమా చూసినా కూడా ఈ విషయం అందరికీ తట్టదు, కానీ ఒక నెటిజన్ కి ఈ విషయం అర్థం కావడంతో సందీప్ ని సోషల్ మీడియాలో ట్యాగ్ చేసి ఇదే విషయాన్ని ప్రస్తావించాడు. దీంతో ఆశ్చర్యపోయిన సందీప్ రెడ్డి వంగా అవును నిజమే ఈ విషయాన్ని ఇప్పటివరకు ఎవరూ గుర్తించలేదు అని తన సోషల్ మీడియా వేదికగా ఆ వీడియో పంచుకున్నారు.
బాలీవుడ్ లో సెటిల్ అయ్యి
అర్జున్ రెడ్డి ఇక్కడ సూపర్ హిట్ కావడంతో అదే సినిమాను కబీర్ సింగ్ పేరుతో హిందీలో రీమేక్ చేస్తే అక్కడ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా ఇచ్చిన సక్సెస్ తో సందీప్ రెడ్డి వంగా ఏకంగా బాలీవుడ్ లో స్థిరపడిపోయాడు అని చెప్పొచ్చు. తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ప్రయత్నించారు కానీ అనూహ్యంగా బాలీవుడ్లోనే యానిమల్ అనే సినిమా చేస్తున్నారు.

25వ సినిమా
ఇక ఇటీవలే ఆయన ప్రభాస్ తన 25వ సినిమా ప్రకటించారు. ఈ సినిమా సందీప్ రెడ్డికి నాలుగో సినిమా కాబోతుండగా ప్రభాస్ కు మాత్రం 25 సినిమాగా నిలబడుతోంది. ఈ సినిమాకి స్పిరిట్ అనే టైటిల్ తో టీ సిరీస్ తో కలిసి యు.వి.క్రియేషన్స్ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఇక పోస్టర్లలో చూపించినట్లుగా స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన క్లారిటీ మాత్రమే ఇంకా వెలువడలేదు


Click it and Unblock the Notifications











