సందీప్ రెడ్డి వంగా కొడుకు పేరు ఏమిటో తెలుసా.. ఆ పేరంటే ఎందుకంత ఇష్టమంటే
అర్జున్ రెడ్డికి ముందు సందీప్ రెడ్డి వంగా అంటే ఎవరికీ తెలియదు. ప్రేక్షకులకు దిమ్మ తిరిగే కథ, కథనాలతో సినీ వర్గాలకు షాకిచ్చిన ఆయన పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. బాడా హీరోలందరూ ఆయన కోసం క్యూ కట్టారు. తాజాగా అర్జున్ రెడ్డి చిత్రాన్ని రీమేక్ చేస్తూ బాలీవుడ్‌లో రూపొందించిన కబీర్ సింగ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు
అర్జున్ రెడ్డితో నాకు చెప్పలేనంత అనుబంధం ఉంది. నా జీవితంలో ఎంత ప్రభావం చూపించిందంటే.. నా కొడుకు పేరును కూడా అర్జున్ రెడ్డిగా పెట్టుకొన్నాను. అర్జున్ రెడ్డి సినిమాకు నా తండ్రి ప్రభాకర్, ప్రణయ్ రెడ్డి నిర్మాతలుగా వ్యవహరించారు. నాకే కాదు.. నా కుటుంబానికి కూడా అర్జున్ రెడ్డి అలా దగ్గరయ్యాడు అని సందీప్ రెడ్డి వంగా వెల్లడించాడు.

టాలీవుడ్‌లో సెన్సేషనల్ సక్సెస్ సాధించిన అర్జున్ రెడ్డి చిత్రంలో హిందీలో రీమేక్‌గా కబీర్ సింగ్ పేరుతో రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ సినిమాలో షాహీద్ కపూర్, కియారా అద్వానీ జంటగా నటించారు. తెలుగులో విజయ్ దేవరకొండ పోషించిన పాత్రను షాహీద్ కపూర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మహేష్ బాబు, ఇతర సినిమాల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
మహేష్ బాబుతో సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. ఆ సినిమా ఆయన యాక్టింగ్ టాలెంట్‌కు, నేను రచనా ప్రతిభకు సవాల్‌గా నిలిచేలా ఉంటుంది. ఇంకా కథ, ప్రాజెక్ట్ గురించి క్లారిటీ లేదు. మా ప్రాజెక్టులతో మేము బిజీగా ఉన్నాం. మా కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేసుకొన్న తర్వాత ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాం అని సందీప్ రెడ్డి అన్నారు.


Click it and Unblock the Notifications











