Don't Miss!
- Sports PBKS vs MI: అందుకే రెండు మార్పులు చేశాం: సామ్ కరణ్
- News నక్షత్రాన్ని మార్చిన గురువు.. ఈ రాశులకు అదృష్ట యోగం
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
‘పింక్’ కాస్తా బ్లూ అయింది.. ‘వకీల్ సాబ్’పై అర్జున్ రెడ్డి డైరెక్టర్
ప్రస్తుతం టాలీవుడ్లో వకీల్ సాబ్ క్రియేట్ చేస్తోన్న ప్రకంపనల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ చూసినా వకీల్ సాబ్ టాపిక్ వినిపిస్తోంది. ఇక ఏపీలోని రాజకీయాల్లోనూ వకీల్ సాబ్ చిచ్చుపెట్టేశాడు. ఏకంగా వకీల్ సాబ్ కోసం ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పోరాడాల్సి వచ్చింది. టికెట్ రేట్లు పెంపు, అదనపు షోల అనుమతిపై ఏపీ ప్రభుత్వం వకీల్ సాబ్ మీద కక్షకట్టింది.
అలా వకీల్ సాబ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అయితే టాలీవుడ్ మాత్రం వకీల్ సాబ్ మానియాలో ఉంది. మెగా ఫ్యామిలీ మొత్తం కూడా వకీల్ సాబ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం తన స్టైల్లో రివ్యూ ఇచ్చేశాడు. పవన్ కళ్యాణ్ టాప్ ఫాంలో ఉన్నాడంటూ ప్రశంసలు కురిపించేశాడు. తాజాగా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా వకీల్ సాబ్ మీద ట్వీట్ వేశాడు.
వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ పింక్‌కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అదే విషయాన్ని గుర్తు చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చే సరికి పింక్ కాస్త బ్లూ అయిందని కామెంట్ చేశాడు. పవన్ కళ్యాణ్ సర్, దిల్ రాజు గారు, శ్రీరామ్ వేణు.. అద్భుతంగా నటించిన ముగ్గురు సూపర్ ఉమెన్స్, వకీల్ సాబ్ టీం మొత్తానికి కంగ్రాట్స్.. అద్భుతమైన హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని అన్నాడు.