For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పింక్’ కాస్తా బ్లూ అయింది.. ‘వకీల్ సాబ్’పై అర్జున్ రెడ్డి డైరెక్టర్

    |

    ప్రస్తుతం టాలీవుడ్‌లో వకీల్ సాబ్ క్రియేట్ చేస్తోన్న ప్రకంపనల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎక్కడ చూసినా వకీల్ సాబ్ టాపిక్ వినిపిస్తోంది. ఇక ఏపీలోని రాజకీయాల్లోనూ వకీల్ సాబ్ చిచ్చుపెట్టేశాడు. ఏకంగా వకీల్ సాబ్ కోసం ఏపీ ప్రభుత్వం హైకోర్టులో పోరాడాల్సి వచ్చింది. టికెట్ రేట్లు పెంపు, అదనపు షోల అనుమతిపై ఏపీ ప్రభుత్వం వకీల్ సాబ్ మీద కక్షకట్టింది.

    అలా వకీల్ సాబ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. అయితే టాలీవుడ్ మాత్రం వకీల్ సాబ్ మానియాలో ఉంది. మెగా ఫ్యామిలీ మొత్తం కూడా వకీల్ సాబ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడింది. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం తన స్టైల్లో రివ్యూ ఇచ్చేశాడు. పవన్ కళ్యాణ్ టాప్ ఫాంలో ఉన్నాడంటూ ప్రశంసలు కురిపించేశాడు. తాజాగా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా వకీల్ సాబ్ మీద ట్వీట్ వేశాడు.

    sandeep reddy vanga about pawan kalyan vakeel saab,

    వకీల్ సాబ్ సినిమా బాలీవుడ్ పింక్‌కు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అదే విషయాన్ని గుర్తు చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చే సరికి పింక్ కాస్త బ్లూ అయిందని కామెంట్ చేశాడు. పవన్ కళ్యాణ్ సర్, దిల్ రాజు గారు, శ్రీరామ్ వేణు.. అద్భుతంగా నటించిన ముగ్గురు సూపర్ ఉమెన్స్, వకీల్ సాబ్ టీం మొత్తానికి కంగ్రాట్స్.. అద్భుతమైన హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని అన్నాడు.

    English summary
    sandeep reddy vanga about pawan kalyan vakeel saab,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X