విజయ్ దేవరకొండపై ఇప్పటికీ కోపం ఉంది.. సందీప్ రెడ్డి వంగ షాకింగ్ కామెంట్స్
స్టార్ హీరో విజయ్ దేవరకొండ చివరిగా ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ప్రస్తుతం కింగ్డమ్ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ ను తాజాగా ప్రారంభించారు. ఇక కింగ్డమ్ చిత్రం కోసం టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్, విజయ్ దేవరకొండ ఫేవరెట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా ప్రమోషన్స్ లో పాలు పంచుకున్నారు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ నటనపైనా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
అర్జున్ రెడ్డితో సెన్సేషన్ గా..
సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం అర్జున్ రెడ్డి. 2017లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ రొమాంటిక్ ఫిల్మ్ తమిళం, హిందీ వెర్షన్ లోనూ విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఈ చిత్రంతోనే అటు విజయ్ దేవరకొండ, ఇటు సందీప్ రెడ్డి వంగ టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారారు. వారి కెరీర్ గ్రాఫ్ కూడా అమాంతం పెరిగింది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగ, స్టార్ హీరో విజయ్ దేవరకొండ భారీ ప్రాజెక్ట్స్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు.

కింగ్డమ్ పై సందీప్ రెడ్డి వంగ రియాక్షన్..
కింగ్డమ్ చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. 5 రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ ను జోరుగా నిర్వహిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమా అప్డేట్స్ ను కూడా అందిస్తున్నారు. ఇప్పటికే నిర్మాత నాగ వంశీ సినిమాపై తన ఇంటర్వ్యూల్లో హైప్ పెంచేశారు. ఇక విజయ్ దేవరకొండ ప్రచార కార్యక్రమాలను షురూ చేశారు. ఈ సందర్భంగా సందీప్ రెడ్డి వంగతో విజయ్, గౌతమ్ తిన్ననూరి స్పెషల్ చిట్ చాట్ నిర్వహించారు. కాగా సందీప్ రెడ్డి వంగ కింగ్డమ్ సినిమాపై మంచి రివ్యూని అందించారు. తను 15 నిమిషాల పాటు స్పెషల్ సీన్స్, 40 నిమిషాల పాటు సినిమాను చూశానని తెలిపారు. శ్రీలంకలో చిత్రీకరించిన జైలు సీన్, విజయ్ లుక్ తనకు బాగా నచ్చిందని చెప్పడం విశేషం.
విజయ్ దేవరకొండపై కోపంగా..
స్పెషల్ చిట్ చాట్ లో సందీప్ రెడ్డి వంగ ఓ విషయాన్ని బయట పెట్టారు. విజయ్ దేవరకొండపై తనకు కోపం ఉందన్నారు. అది కేవలం విజయ్ నుంచి రావాల్సిన అసలైన పెర్ఫామెన్స్ రావడం లేదనేదే. ఆడియెన్స్, ఫ్యాన్స్ విజయ్ ని అంతలా ఆదరిస్తున్న సమయంలో కచ్చితంగా కోర్ లెవల్ పెర్ఫామెన్స్ ఇవ్వాల్సి ఉంటుందని విజయ్ దేవరకొండకు నేరుగానే సూచించారు. ఇక కింగ్డమ్ తో ఆ వైబ్స్ కనిపిస్తున్నాయని ప్రశంసించారు. ఇటు విజయ్ కి, అటు గౌతమ్ తిన్ననూరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
కింగ్డమ్ చిత్రం బడ్జెట్..
విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న చిత్రం కింగ్డమ్. ఈ చిత్రానికి సూర్య దేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. సితారా ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫర్ సినిమా, శ్రీకర స్టూడియో బ్యానర్లపై ఈ చిత్రాన్ని రూ.150 కోట్లతో నిర్మించినట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సత్య దేవ్ కీలక పాత్ర పోషించారు. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్ర సంగీతం అందించడం విశేషం.


Click it and Unblock the Notifications











