సందీప్ రెడ్డి వంగా డ్రీమ్ ప్రాజెక్ట్ అదే.. కానీ తీయలేకపోయిన కారణమేంటీ!

సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)సినిమాల గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'అర్జున్ రెడ్డి' కావచ్చు, ఆ మూవీ హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' కావచ్చు లేదంటే రణబీర్ కపూర్ హీరోగా రూపొందించిన 'యానిమల్' కావచ్చు... ఇంటెన్స్ స్టోరీలను తెరపైకి తీసుకు వచ్చారు. ఇప్పుడు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే, సందీప్ రెడ్డి వంగా డ్రీమ్ ప్రాజెక్ట్ మరొకటి ఉందట. కానీ, ఈ సినిమా తీయాలని ప్రయత్నించి విఫలమయ్యారంట.ఇంతకీ ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎంటీ?

సందీప్ రెడ్డి వంగా డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో కాదు..కింగ్ ఆఫ్ పాప్, లెజెండరీ సింగర్ మైఖేల్ జాక్సన్ బయోపిక్. .. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' వంటి సంచలన సినిమలతో తనదైన స్టైల్‌ను నిరూపించుకున్న సందీప్ రెడ్డి వంగా, ప్రపంచ స్థాయిలో మైఖేల్ జాక్సన్ బయోపిక్ తీయాలని భావించారట. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వంగా మాట్లాడుతూ మైఖేల్ జాక్సన్ జీవితం ఒక సినిమాకు కావాల్సిన అన్ని అంశాలతో నిండి ఉందని చెప్పారు. చిన్నతనంలోనే పాటల ప్రపంచంలోకి అడుగుపెట్టి, జాక్సన్ 5 బ్యాండ్‌తో సంచలనం సృష్టించి, ఆ తర్వాత సోలో స్టార్‌గా ఎదిగిన మైఖేల్ జీవితం నిజంగా ఓ అద్భుతమైన కథ అని అభిప్రాయపడ్డారు.

Sandeep Reddy Vanga Dream Project Was Michael Jackson Biopic But It Never Happened

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా మాటల్లో చెప్పాలంటే.. "మైఖేల్ జాక్సన్ జీవితం చాలా ఆసక్తికరం. స్కూల్ రోజుల నుంచే పాటలు పాడడం మొదలుకొని, ప్రపంచ స్టార్‌గా ఎదగడం వరకు ప్రతి దశలో ఒక కథ ఉంది. ఆయన ఎదుర్కొన్న అవమానాలు, వ్యక్తిగత జీవితంలోని మార్పులు, రంగు మార్చుకోవడం నుంచి వచ్చిన విమర్శలు.. అన్నీ కలిపి ఒక గొప్ప సినీ కథలా ఉంటాయి' అని తెలిపారు.

అయితే ఈ బయోపిక్‌ను తీయడంలో ప్రధాన సమస్య ఏంటంటే.. మైఖేల్ జాక్సన్ పాత్రకు సరైన నటుడిని ఎంపిక చేయడమేనని వంగా స్పష్టం చేశారు. "ఆయనను తెరపై ఎవరు పోషిస్తారు? అదే అసలు ప్రశ్న" అని అన్నారు. మైఖేల్ జాక్సన్ స్టేజ్ ప్రెజెన్స్, బాడీ లాంగ్వేజ్, డ్యాన్స్ స్టైల్ అవన్నీ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందాయి. అలాంటి లెజెండ్‌ను తెరపై సజీవంగా చూపించడం ఏ నటుడికైనా పెద్ద సవాలే అని చెప్పారు.

ఇక మరో ముఖ్య అంశంగా మైఖేల్ జీవితంలోని వివాదాస్పద ఘట్టాలను ఎలా చూపించాలి? అనే ప్రశ్నను కూడా వంగా లేవనెత్తారు. ఆయన జీవితంలో చివరి దశలో ఎన్నో ఆరోపణలు, వివాదాలు చోటు చేసుకున్నాయి. అవి పూర్తిగా నిజమా? కాదా? అన్నది చాలా క్లిష్టమైన అంశమని, ఏదైనా విషయం నిరూపితమయ్యే వరకు సరైనది ఏది, తప్పు ఏది అనేది చెప్పడం కష్టం అని అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే.. తాజా విడుదలైన 'మైఖేల్' సినిమాలో మైఖేల్ జాక్సన్ మేనల్లుడు జాఫర్ జాక్సన్ కథానాయకుడిగా నటించిన విషయం తెలిసిందే. జాఫర్ జాక్సన్‌ను హీరోగా తీసుకోవడం ద్వారా రూపురేఖలు, స్టైల్, డ్యాన్స్ మూవ్స్ పరంగా నిజమైన అనుభూతి తీసుకురావాలని దర్శకుడు ఆంటోయిన్ ఫుక్వా ప్రయత్నించారు. ఇప్పటికే జాఫర్ నటనపై మొదటి స్పందనలు చాలా పాజిటివ్‌గా ఉన్నాయి. ఆయన తన మామను తెరపై మళ్లీ బ్రతికించినట్లు అనిపించిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఈ సినిమాలో మైఖేల్ తల్లిదండ్రుల పాత్రల్లో కోల్మన్ డొమింగో, నియా లాంగ్ నటించారు. మొత్తానికి 'Michael' సినిమా విడుదలతో సందీప్ రెడ్డి వంగా పాత ఇంటర్వ్యూ మళ్లీ వైరల్ కావడం విశేషం. ఒకవేళ ఆయన చేతిలో ఈ బయోపిక్ వచ్చి ఉంటే ఎలా ఉండేదో అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో సాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X