సందీప్ రెడ్డి వంగా డ్రీమ్ ప్రాజెక్ట్ అదే.. వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..

టాలీవుడ్‌లో ఇంటెన్స్ కథలతో, బోల్డ్ టేక్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ( Sandeep Reddy Vanga). అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి సినిమాలతో తనదైన స్టైల్‌ను ప్రూవ్ చేసుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం ప్రభాస్ హీరోగా 'స్పిరిట్' సినిమాతో ప్రస్తుతం ఉన్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ కంటే ముందే అతని మనసులో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందని తాజాగా వెలుగులోకి వచ్చింది.ఇంతకీ ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ ఎంటీ? ఆ హీరో ఎవరు?

సందీప్ రెడ్డి వంగా సినిమాలంటేనే అగ్రెషన్, ఎమోషన్, ఇంటెన్సిటీకి ప్రతీక. అతని హీరోల ప్రేమలోనూ, కోపంలోనూ హద్దులు తెలియకుండా ప్రవర్తిస్తారు. ఆ ఎమోస్‌నే అతను కథలో ప్రధానంగా చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. ఈ స్టైల్ వెనుక ఉన్న ఇన్స్పిరేషన్ గురించి చెప్పుకుంటే... అది చిరంజీవి సినిమాలేనని. ముఖ్యంగా 'ఆరాధన' సినిమాలో చిరంజీవి నటించిన పులిరాజు పాత్ర సందీప్‌పై ఎంత ప్రభావం చూపిందో ఇప్పుడు స్పష్టమవుతోంది.

Sandeep Reddy Vanga Dream Project with Chiranjeevi A Powerful Action Film Buzz

ఇటీవల సందీప్ తన ఆఫీస్‌కు సంబంధించిన ఫోటోను షేర్ చేయగా, అందులో చిరంజీవి ఫోటో ఫ్రేమ్ అందరి దృష్టిని ఆకర్షించింది. అది సాధారణ ఫోటో కాదు... 'ఆరాధన' సినిమాలో ఒక కీలక సీన్‌లో చిరంజీవి ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్. హీరోయిన్ సుహాసిని చెంపదెబ్బ కొట్టినప్పుడు చిరంజీవి చూపించిన ఆ ఒక్క క్షణం భావవ్యక్తీకరణ సందీప్ మనసులో గాఢంగా ముద్ర పడింది. అందుకే ఆ ఎక్స్‌ప్రెషన్‌ను ఫ్రేమ్ కట్టించి తన ఆఫీస్ గోడకు పెట్టుకున్నాడు.

ఈ విషయంతో సందీప్ ఎంతటి హార్డ్‌కోర్ చిరంజీవి ఫ్యానో అర్థమవుతోంది. ఒక సీన్ ఎక్స్‌ప్రెషన్‌ను ఇంత లోతుగా అర్థం చేసుకోవడం, అది తనకు ఇన్‌స్పిరేషన్‌గా మార్చుకోవడం అతని డైరెక్షన్ స్టైల్‌ను కూడా సూచిస్తుంది. అతని సినిమాల్లో కనిపించే అగ్రేసివ్ హీరో క్యారెక్టర్స్ వెనుక కూడా చిరంజీవి ప్రభావం ఉందని చెప్పవచ్చు.

అయితే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగా చేసిన కామెంట్స్ ఇప్పుడు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. "చిరంజీవి గారు అవకాశం ఇస్తే, ఆయనతో సినిమా చేయడానికి నేను రెడీ. ఆయనతో ఒక పవర్ ఫుల్ యాక్షన్ సినిమా తీయాలనుకుంటున్నాను" అని స్పష్టంగా చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు ఎన్నో రకాల పాత్రల్లో నటించినప్పటికీ, సందీప్ వంగా స్టైల్‌లో పూర్తిగా అగ్రెసివ్, రా క్యారెక్టర్‌లో కనిపిస్తే ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

సందీప్ ఇంటెన్స్ కథ, చిరంజీవి స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే... అది ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఒక గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం సందీప్ 'స్పిరిట్' సినిమాతో ఉండగా, చిరంజీవి కూడా వరుస ప్రాజెక్ట్స్‌తో ముందుకు సాగుతున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో స్పష్టత లేకపోయినా, సందీప్ మనసులో ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం బలంగా ఉంది. సందీప్ రెడ్డి వంగా - చిరంజీవి కాంబో నిజమైతే.. అది కేవలం సినిమా కాదు... ఇండియన్ సినిమాకు మరో కొత్త ట్రెండ్ సెట్ చేయడం మాసివ్ ఈవెంట్‌గా నిలవడం ఖాయం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X