ప్రభాస్ ఆఫర్ ను రిజెక్ట్ చేసిన స్టార్ డైరెక్టర్.. ఏం జరిగిందంటే?
ఇపుడు టోటల్ పాన్ ఇండియా బాక్సాఫీస్ మార్కెట్ లో మన తెలుగు సినిమా హీరోలు కానీ దర్శకులు కానీ ఎలాంటి సత్తా చాటుతున్నారో అంతా చూస్తూనే ఉన్నారు. దీనితో ఒక భాష నుంచి మరో భాష దర్శక హీరోలు కలిసి పని చేసే ట్రెండ్ కూడా బాగా ఊపందుకుంది ఇలా మన తెలుగు సినిమా నుంచి హిందీ మార్కెట్ లోకి వెళ్లి ఏ రేటెడ్ సినిమాతో కనీ వినీ ఎరుగని రేంజ్ వసూళ్లు అందించి దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే యాంగ్రీ యంగ్ డైరెక్టర్ మిస్టర్ సందీప్ రెడ్డి వంగ అనే చెప్పాలి.
తీసింది ఒరిజినల్ గా రెండే సినిమాలు అయినప్పటికీ సందీప్ రెడ్డి వంగ క్రియేట్ చేసిన ప్రభావం అంతా ఇంతా కాదు. హిందీలో మార్కెట్ లో ఎంతో మంది దర్శకులు అందుకోలేని స్టార్డంని కేవలం రెండు మూడు సినిమాల తోనే సందీప్ రెడ్డి వంగ అందుకున్నాడు. అయితే ఇలాంటి సందీప్ రెడ్డి వంగ ఓ బిగ్గెస్ట్ హీరో అది కూడా మన తెలుగు సినిమా హీరో నాతో సినిమా చెయ్యి అని ఆఫర్ చేస్తే అందుకు సందీప్ రెడ్డి వంగ నో చెప్పేశాడట.

కాగా ఆ హీరో ఎవరో కూడా కాదు పాన్ ఇండియా సినిమా సందీప్ లానే తన మార్క్ ని వేసుకున్న రెబల్ స్టార్ ప్రభాసే అట. అదేంటి ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పుడు "స్పిరిట్" అనే సినిమా ఉంది కదా అయినా నో చెప్పడం ఏంటి అంటే.. స్పిరిట్ కంటే ముందే ప్రభాస్ సందీప్ తో ఓ భారీ సినిమా చేయాల్సి ఉందట. అది కూడా ప్రభాస్ నే సందీప్ తో వర్క్ చేయాలనీ అడిగాడట.
అప్పటికే భారీ స్టార్డం ఉన్న డార్లింగ్ లాంటి హీరో స్వయంగా సినిమా చేస్తావా అని అడిగితే ఏ దర్శకుడు అయినా నో చెప్తాడా? కానీ మిస్టర్ వంగ చెప్పాడట. కాగా దీనికి బలమైన కారణం కూడా ఉందని తెలుస్తుంది. అదేమిటంటే ప్రభాస్ కి ఆ మధ్య హాలీవుడ్ లో చూసిన ఓ సినిమా బాగా నచ్చిందట. దానిని ఇక్కడ రీమేక్ చేయడానికి సందీప్ ని దర్శకుడుగా అనుకున్నారట.
కానీ ప్రభాస్ తో రీమేక్ సినిమా చేయనని చెప్పేసాడట. ఆ తర్వాత వచ్చాడు "స్పిరిట్" స్క్రిప్ట్ పట్టుకొని. అలా ఆ రీమేక్ వదిలేసి ప్రభాస్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్పిరిట్ తెస్తే అలా ఈ ఇద్దరి కాంబినేషన్ లో భారీ అంచనాలు సెట్ అయ్యాయి. ఇప్పుడు స్పిరిట్ పై ఉన్న అంచనాలు కోసం కానీ హైప్ కోసం కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు..
కాగా ఈ చిత్రం షూటింగ్ ఈ ఏడాది చివరలో స్టార్ట్ చేయనుండగా వచ్చే ఏడాది చివరలో లేదా 2026 లో రిలీజ్ కి తీసుకొచ్చే పనిలో ఉన్నారు. అలాగే ఏ సినిమాలో కొరియన్ బాలయ్య డాన్ లీ విలన్ గా నటిస్తున్నాడు అని కొన్ని స్ట్రాంగ్ రూమర్స్ కూడా ఉన్నాయి. అవి నిజం అయ్యే ఛాన్స్ కూడా ఉందని ఇండస్ట్రీలో టాక్ ఉంది.


Click it and Unblock the Notifications











