Spirit: ప్రభాస్ సినిమా స్టోరీ లీక్ చేసిన సందీప్ రెడ్డి.. ఫ్యాన్స్‌కు పక్కా ఫుల్ మీల్స్ ఖాయం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎంతో మంది పాన్ ఇండియా స్టార్లు ఉన్నారు. కానీ, అందరి కంటే ముందు రేంజ్‌ను అందుకున్న హీరో మాత్రం యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అని అందరికీ తెలిసిందే. 'బాహుబలి' సిరీస్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అతడు.. వరుసగా అతి భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తూ ముందుకు సాగుతోన్నాడు. ఇలా ఇప్పుడు కూడా ఏకకాలంలో చేతి నిండా చిత్రాలను చేస్తోన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్టు K' చిత్రాలతో పాటు మారుతి దర్శకత్వంలోనూ ఓ హర్రర్ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే.
కొంత కాలంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాదిలోనే తన 25వ సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ఈ సినిమాకు 'స్పిరిట్' అనే టైటిల్ పెట్టారు. దీన్ని పాన్ వరల్డ్ రేంజ్‌లో ఎనిమిది భాషల్లో రూపొందిస్తున్నట్లు అప్పుడే ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడి చాలా కాలమే అవుతోన్నా.. ప్రభాస్ వేరే చిత్రాలతో బిజీగా ఉండడంతో ఇప్పటి వరకూ చిత్రీకరణ మాత్రం ప్రారంభం కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ మూవీ గురించి సందీప్ రెడ్డి వంగా ఓ అప్‌డేట్ ఇచ్చాడు.

క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'స్పిరిట్' మూవీ భారీ యాక్షన్ బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందనున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సందీప్ రెడ్డి వంగా స్పందించాడు. 'ప్రభాస్‌తో రా అండ్ పవర్‌ఫుల్ యాక్షన్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. అందుకు అనుగుణంగానే ఇప్పుడు పవర్‌ఫుల్ స్టోరీనే రాస్తున్నా. ఇది కచ్చితంగా రీఫ్రెష్‌గా ఉంటుంది. ప్రభాస్ అభిమానులు మా కాంబో ఎలా ఉండాలని అనుకుంటున్నారో అంతకు మించేలానే ప్లాన్ చేస్తున్నాం' అని చెప్పుకొచ్చాడు.

పాన్ వరల్డ్ రేంజ్‌లో రాబోతున్న 'స్పిరిట్' మూవీలో ప్రభాస్ సరసన నయనతార నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ విలన్‌గా నటిస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ వైరల్ అయింది. అలాగే, ఎంతో మంది ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారని అంటున్నారు. ఇక, ఈ చిత్రాన్ని భూషన్ కుమార్ నిర్మిస్తోన్నారు.


Click it and Unblock the Notifications











