Spirit రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన డైరెక్టర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇది బ్యాడ్ న్యూసే!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడున్న స్టార్ హీరోల్లో పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిన మొదటి వాడు యంగ్ రెబెల్ ప్రభాస్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 'బాహుబలి' సిరీస్‌తో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అతడు.. వరుసగా అతి భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తూ ముందుకు సాగుతోన్నాడు. ఇలా ఇప్పుడు కూడా ఏకకాలంలో చేతి నిండా చిత్రాలను చేస్తూ దూసుకుపోతోన్నాడు.
కొన్నేళ్లుగా యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాదిలోనే తన 25వ సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ఈ సినిమాకు 'స్పిరిట్' అనే టైటిల్ పెట్టారు. దీన్ని పాన్ వరల్డ్ రేంజ్‌లో ఎనిమిది భాషల్లో రూపొందిస్తున్నట్లు అప్పుడే ప్రకటించారు.

'స్పిరిట్ ' సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడి చాలా కాలమే అవుతోన్నా.. ప్రభాస్ వేరే చిత్రాలతో బిజీగా ఉండడంతో ఇప్పటి వరకూ చిత్రీకరణ మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా? ఉండదా? అన్న అనుమానాలు సైతం వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ మూవీ గురించి సందీప్ రెడ్డి వంగా ఓ అప్‌డేట్ ఇచ్చాడు.
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'స్పిరిట్' మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంకా ప్రారంభం కాలేదని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించాడు. వచ్చే ఏడాది సమ్మర్ నాటికి దీన్ని పూర్తి చేస్తామని తెలిపాడు. అంతేకాదు, 2024 చివర్లో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలు పెడతామని పేర్కొన్నాడు.
తాజాగా 'యానిమల్' మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా.. 'స్పిరిట్' మూవీ రిలీజ్ ప్లాన్ గురించి క్లారిటీ ఇచ్చారు. ప్రభాస్ సినిమాను 2025 క్రిస్టమస్ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపాడు. ఒకవేళ అప్పుడు కుదరకపోతే 2026 సంక్రాంతికి దీన్ని తీసుకు వస్తామని చెప్పాడు. అంటే ప్రభాస్ సినిమా కోసం మరో రెండేళ్లు ఆగాల్సిందే.
ఇదిలా ఉండగా.. పాన్ వరల్డ్ రేంజ్‌లో రాబోతున్న 'స్పిరిట్' మూవీలో ప్రభాస్ సరసన నయనతార నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ విలన్‌గా నటిస్తున్నట్లు న్యూస్ వైరల్ అయింది. అలాగే, ఎంతో మంది ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారని అంటున్నారు. ఇక, ఈ చిత్రాన్ని భూషన్ కుమార్ నిర్మిస్తోన్నారు.


Click it and Unblock the Notifications











