Spirit స్టోరి లీక్ చేసిన సందీప్ రెడ్డి వంగ.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే
ఈ మధ్య కాలంలో టాలీవుడ్ రేంజ్ భారీ స్థాయిలో పెరిగింది. అలాగే, ఎంతో మంది హీరోల స్థాయి కూడా నెక్ట్స్ లెవెల్‌కు వెళ్లిపోయింది. అలా అందరి కంటే ముందే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు రెబెల్ స్టార్ ప్రభాస్. 'బాహుబలి'తో ఈ ఖ్యాతిని అందుకున్న అతడు.. అప్పటి నుంచి భారీ బడ్జెట్ చిత్రాల్లోనే నటిస్తున్నాడు. తద్వారా వరల్డ్ రేంజ్‌ను చేరుకుంటున్నాడు.
కొంత కాలంగా రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఈ క్రమంలోనే గత ఏడాదిలోనే తన 25వ సినిమాను కూడా అనౌన్స్ చేశాడు. అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించే ఈ సినిమాకు 'స్పిరిట్' అనే టైటిల్ పెట్టారు. దీన్ని పాన్ వరల్డ్ రేంజ్‌లో ఎనిమిది భాషల్లో రూపొందిస్తున్నట్లు ఆ సమయంలోనే వెల్లడించారు.

'స్పిరిట్ ' సినిమాకు సంబంధించిన ప్రకటన వెలువడి చాలా కాలమే అవుతోన్నా.. ప్రభాస్ వేరే చిత్రాలతో బిజీగా ఉండడంతో ఇప్పటి వరకూ చిత్రీకరణ మాత్రం ప్రారంభం కాలేదు. దీంతో అసలు ఈ ప్రాజెక్టు ఉంటుందా? ఉండదా? అన్న అనుమానాలు సైతం వ్యక్తం అయ్యాయి. ఈ పరిస్థితుల్లోనే చిత్ర యూనిట్ త్వరలోనే ఈ మూవీ ప్రారంభం కాబోతుందని ప్రకటించింది.
హై రేంజ్ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'స్పిరిట్' మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇంకా ప్రారంభం కాలేదని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రకటించాడు. అలాగే, 2024 చివర్లో ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్‌ను మొదలు పెడతామని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై మరో అప్‌డేట్ ఇచ్చేశాడు.

తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న సందీప్ రెడ్డి వంగా.. తన తదుపరి చిత్రం 'స్పిరిట్' అని తేల్చేశాడు. అంతేకాదు, ఈ సినిమా హర్రర్ జోనర్‌లో వస్తుందా అని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. 'ప్రభాస్ గారితో చేసే స్పిరిట్ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ స్టోరీతో వస్తుంది. ఇప్పటి వరకూ ఈ సినిమా గురించి ఇది మాత్రమే చెప్పగలను' అంటూ అసలైన విషయాన్నే రివీల్ చేసేశాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉండగా.. పాన్ వరల్డ్ రేంజ్‌లో రాబోయే 'స్పిరిట్' మూవీలో ప్రభాస్ సరసన నయనతార నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ విలన్‌గా నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే, ఎంతో మంది ప్రముఖులు ఇందులో కీలక పాత్రలు చేస్తున్నారని అంటున్నారు. ఇక, ఈ చిత్రాన్ని భూషన్ కుమార్ నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











