నా సినిమాల్ని నా పిల్లలకి చూపించలేను.. ప్రభాస్ మూవీ చూపిస్తా... సందీప్ రెడ్డి వంగా
సందీప్ రెడ్డి వంగా... పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. హీరోలు ఇలాగే ఉండాలన్న లిమిట్స్‌ను క్రాస్ చేసి నెగిటివ్‌గా, క్రూరంగా చూపిస్తూ కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టి భారీ హిట్స్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. 9 ఏళ్ల కెరీర్‌లో మూడు సినిమాలు మాత్రమే తీసిన సందీప్... పాన్ ఇండియా డైరెక్టర్‌గా.. స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నారు. తనకు నచ్చినట్లుగా సినిమాలు తీస్తూ.. విలువలు, సంప్రదాయాలు వంటి లెక్కలు తనకు లేవని నిరూపించారు. ఆడియన్స్ కూడా సందీప్ సినిమాలకు బ్రహ్మరథం పడుతూ కనక వర్షం కురిపిస్తున్నారు.
యానిమల్ తర్వాత దాదాపు రెండేళ్లుగా ఖాళీగానే ఉన్న సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో స్పిరిట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా పోస్టర్ అంచనాలను పెంచేసింది. ఒళ్లంతా గాయాలు వాటికి బ్యాండేజ్‌లతో షర్ట్ లేకుండా ఉన్న ప్రభాస్‌కు హీరోయిన్ తృప్తి దిమ్రి సిగరెట్ వెలిగిస్తున్న పోస్టర్ సంచలనం సృష్టిస్తోంది. ఈ పోస్టర్‌తోనే తాను ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నాడో? స్పిరిట్ ఎలా ఉండబోతుందో? హింట్ ఇచ్చేశాడు సందీప్.

సినిమాలు చేయకున్నా ఎప్పుడూ సోషల్ మీడియాలో, టీవీలలో కనిపించడంతో సందీప్ రెడ్డి స్టైల్. టాలీవుడ్ నుంచి ఏ పెద్ద సినిమా రిలీజైనా సందీప్‌తో ఇంటర్వ్యూ ఉండాల్సిందే. అలా ఆయనతో ప్రమోషన్స్ చేయించేందుకు హీరోలు, దర్శకులు తెగ తాపత్రయపడుతున్నారు. ఆర్ఆర్ఆర్, దేవర, కింగ్డమ్, శివ రీ రిలీజ్, హాయ్ నాన్న తదితర సినిమాల సమయంలో ఆయా సినిమాల దర్శకులు, హీరోలతో సందీప్ చేసిన ఇంటర్వ్యూలు వైరల్ అయ్యాయి. ప్రొఫెషనల్ యాంకర్‌లా వంగా చేసిన సందడి ఆకట్టుకుంది. స్ట్రాంగ్ పాయింట్‌తో సందీప్ అడిగే ప్రశ్నలకు అవతలి వైపు నుంచి కూడా గట్టి ఆన్సర్ వచ్చేది. పైగా పాన్ ఇండియా డైరెక్టర్ కావడంతో దేశవ్యాప్తంగా ఆ ఇంటర్వ్యూలు వైరల్ అయి తమ సినిమాలకు కలిసొస్తుందని సందీప్ రెడ్డి వంగాతో ప్రమోషనల్ కార్యక్రమాలకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తుండొచ్చు.
తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది రాజా సాబ్. రిద్ది కుమార్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌లు హీరోయిన్లుగా నటించారు. జనవరి 9వ తేదీన ది రాజాసాబ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌తో పాటు ఈ సినిమాలో నటించిన ముగ్గురు హీరోయిన్లతో సందీప్ రెడ్డి వంగా నిర్వహించిన ఇంటర్వ్యూ వైరల్ అవుతోంది. ఇందులో తన సినిమాలు, ఇతర విషయాల గురించి సందీప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజా సాబ్ ఏ జోనర్ అని చెప్పడం కష్టం.. హార్రర్, ఫాంటసీ, రొమాంటిక్, కామెడీ అన్ని ఉన్నాయి.. 70 శాతం సినిమా కామెడియే. తొలిసారిగా నేను కామెడీ సినిమాలో నటించడం ఇండియా మొత్తం చూడనుంది అని ప్రభాస్ అన్నారు. ఒక పెద్ద సూపర్‌స్టార్ కంప్లీట్‌గా యాక్షన్ నుంచి ఈ తరహా సినిమా చేయడం మామూలు విషయం కాదు.. మీరు ఈ సినిమాకు ఎలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సందీప్ ప్రశ్నించగా.. తొలి సినిమాకే యాక్షన్ హీరోని. ఒకే తరహా చిత్రాలు చేయడం బోర్ కొట్టింది. అందుకే డార్లింగ్ చేశా.. . ఇది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు నేను కామెడీ కూడా చేయగలనని భారతీయ ప్రేక్షకులకు చెప్పాలని అనుకున్నానని ప్రభాస్ తెలిపారు.
ఇదే ఇంటర్వ్యూలో స్పిరిట్ పోస్టర్ గురించి హీరోయిన్ నిధి అగర్వాల్ ప్రశ్నించింది. ప్రభాస్ సార్ చేతిలో ఆ గ్లాస్ ఏంటీ అని అడగ్గా.. అది గ్లాస్ కాదు లీటర్ బాటిల్ అని క్లారిటీ ఇచ్చాడు సందీప్. పోస్టర్‌లో తెలుగు రంగును ఎక్కువగా హైలైట్ చేయడంతో లీటర్ బాటిల్ అందరికీ కనెక్ట్ అయ్యిందని సందీప్ అన్నారు. స్పిరిట్ పోస్టర్‌తో చాలామంది స్టార్స్, హీరోయిన్ల ఫేస్‌లతో మీమ్స్ చేశారని హీరోయిన్ మాళవిక తెలిపారు.
రాజా సాబ్ ట్రైలర్ చూశాక ఎగ్జయిట్‌మెంట్ తట్టుకోలేకపోయా. అసలు సినిమాలో ప్రభాస్ గ్రాండ్ ఫాదర్ ఎవరు? ఏం జరుగుతుంది? అనేది తెలుసుకోవాలని ఎదురుచూస్తున్నా. నా పిల్లలకు నా సినిమాలు చూపించను. ప్రభాస్ సినిమాలు చూపిస్తా. కల్కి చూపించా, ఇప్పుడు రాజా సాబ్ కూడా చూపిస్తానని సందీప్ రెడ్డి అన్నారు. రాజా సాబ్ నుంచి వచ్చిన సెకండ్ ట్రైలర్ నా ఫేవరెట్ అని రిద్దికుమార్ చెప్పారు. రాజా సాబ్ ఖచ్చితంగా బాగా ఆడుతుంది. ఇకపై ఇండియాలో ఈ తరహా సినిమాలు వస్తాయి. పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న టైంలో ఒకరికొకరు సాయం చేసుకోవాలి. దీని వల్ల మరిన్ని అవకాశాలు వస్తాయి. ఒక ప్రేక్షకురాలిగా సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా? అని ఎదురుచూస్తున్నానని నిధి అగర్వాల్ అన్నారు. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











