Don't Miss!
- News జగన్‌ను ఓడించడానికి ఒక్కటైన ఇద్దరు సీఎంలు
- Sports SRH vs RCB: హమ్మయ్యా.. ప్రశాంతంగా పడుకుంటాం! ఆ గ్రౌండ్‌తోనే మాకు ఇబ్బంది: ఫాఫ్ డుప్లెసిస్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఎల్లప్పుడూ ఇతరులకు రహస్య శ్రేయోభిలాషులు..
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
బాలీవుడ్ కంటే టాలీవుడ్ క్రిటిక్స్ బెటర్.. 2 రేటింగ్ ఇస్తే 200 కోట్లు.. సందీప్ రెడ్డి ఫైర్
బాలీవుడ్ తారలు షాహీద్ కపూర్, కియారా అద్వానీ జంటగా సందీప్ రెడ్డి వంగా రూపొందించిన కబీర్ సింగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతున్నది. క్రిటిక్స్, ట్రేడ్ అనలిస్టుల అంచనాలు తలకిందులు చేస్తూ.. 300 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతున్నది. అయితే ఈ సినిమా గురించి క్రిటిక్స్ తప్పుగా మాట్లాడటం, డీగ్రేడ్ రేటింగ్ ఇవ్వడంపై ఇటీవల సందీప్ రెడ్డి వంగ మండిపడ్డారు. బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కడిగిపడేశాడు. ఇంతకు సందీప్ రెడ్డి ఏమన్నారంటే..
సంజూ సినిమాకు రాజీవ్ మన్సాందానీ 3.5 రేటింగ్ ఇచ్చాడు. అందులో బూతు లేదా? డ్రగ్స్ వాడకం లేదా? 300 మంది అమ్మాయిలతో పడుకున్నానంటే చప్పట్లు కొట్టలేదా? కబీర్ సింగ్‌పై ఇలాంటి వివక్ష ఎందుకు? ప్రశ్నించాడు.
బాలీవుడ్లో చాలా మంది క్రిటిక్స్ 2, అంతకంటే తక్కువ రేటింగ్ ఇస్తే.. ప్రేక్షకులు ఈ సినిమాకు రూ.200 కోట్ల కలెక్షన్లు ఇచ్చారు. ఇంతకంటే కబీర్ సింగ్‌కు ఏం కావాలి అని సందీప్ ప్రశ్నించారు. క్రిటిక్స్‌కు కబీర్ సింగ్ మరోసారి చెంపపెట్టు అని ఆయన కామెంట్ చేశారు.
మహిళను చెంపపై కొట్టడం శారీరక హింస. కబీర్ సింగ్‌లో అలాంటి సీన్లు చాలా ఉన్నాయి. మద్య మత్తులో మహిళలపై హింస కనిపిస్తున్నది అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ప్రేమ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర అవగాహన. మానసిక, శారీరక హింస ప్రేమలో తిరగోమనం అని నెటిజన్ కామెంట్ పెట్టింది. కబీర్ సింగ్‌లో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ కాదు అని అన్నారు.
ఇదిలా ఉండగా, కబీర్ సింగ్ 15 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి. రెండో శుక్రవారం ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.5.40 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా సాధించిన కలెక్షన్లు రూ.218.60 కోట్లకు చేరింది.