ఒంటిపై నూలుపోగు లేకుండా చైతన్య రావు.. సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా దిల్ దియా పోస్టర్!
తెలుగు సినిమా పరిశ్రమలో విభిన్నమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకొంటున్న నటుడు చైతన్యరావు మాదాడి విలక్షణ పాత్రతో కనిపించబోతున్న చిత్రం దిల్ దియా. A Naked Truth ఉప శీర్షిక. సెన్సిబుల్ డైరెక్టర్ కే క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతున్నది. ఎ పూర్ణ నాయుడు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై పూర్ణ నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ వి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ చిత్రంలో ఇరా, సఖి, జెస్సీ, మణి చందన, ప్రమోదిని, వీర శంకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు పీజీ విందా సినిమాటోగ్రాఫర్‌గా, ఫణి కళ్యాణ్ సంగీతాన్ని, రా షా (రవి-శశాంక్) ఎడిటర్‌గా, చిన్నా ప్రొడక్షన్ డిజైనర్‌గా, ధని ఏలే పబ్లిసిటీ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ చేతుల మీదుగా రిలీజ్ చేయగా, సోషల్ మీడియాలో చైతన్య రావు లుక్ వైరల్ అయింది. కొద్ది గంటల్లోనే నెటిజన్లతో భారీ డిస్కషన్ జరగడమే కాకుండా ఈ సినిమాపై అంచనాలు ఏర్పడేలా చేశాయి.

ఓనమాలు, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి చిత్రాలతో ఫీల్‌గుడ్, సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకొన్న క్రాంతి మాధవ్ యువతను టార్గెట్ చేస్తూ ఎమోషనల్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించే ప్రయత్నం చేసినట్టు పోస్టర్ స్పష్టం చేసింది. మానవ బంధాలు, సంబంధాలు, వ్యక్తిగత రిలేషన్స్, మానసిక సంఘర్షణ అంశాలను జోడించి యూత్‌ఫుల్ డ్రామాగా ఈ సినిమాను అందించడానికి సిద్దమయ్యారనే అంశం పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పారు అనే అభిప్రాయం నెటిజన్లలో వ్యక్తమవుతున్నది.
దిల్ దియా సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ పోస్టర్‌ను గమనిస్తే.. చైతన్యరావు ఎవరూ ఊహించని క్యారెక్టర్‌లో దర్శనమిచ్చారు. ఒంటిపై నూలుపోగు లేకుండా నగ్నంగా కనిపించారు. సోఫాలో కూర్చొన్న చైతన్యరావును చూస్తే.. ఈ సినిమాలో కంటెంట్ ఎమోషనల్‌గానే కాకుండా ట్రెండీగా, డ్రామాతో కూడిన సెంటిమెంట్ కూడా ఉండబోతుందనే విషయం బోధపడింది.
ఈ చిత్రంలో కేవలం చైతన్యరావు పాత్రనే కాకుండా ఇంకా అంతర్గత సంఘర్షణలు, భావోద్వేగాలతో కూడిన పాత్రలు ఉండబోతున్నాయనే విషయాన్ని తన పోస్టర్‌తోనే క్లారిటీ ఇచ్చారు. దర్శకుడి స్పష్టమైన విజన్, బలమైన క్రియేటివ్ సపోర్ట్‌తో దిల్ దియాసినిమాను బాక్సాఫీస్‌కు కొత్త భాషను పరిచయం చేసే చిత్రంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా 2026 సమ్మర్లో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
మోడరన్ లైఫ్‌లో రిలేషన్స్, కథ, కథనాల్లో ఎలాంటి అమరికలు లేకుండా స్వచ్ఛమైన కంటెంట్‌తో యువతకు సందేశం, ప్రేమ, భావోద్వేగాలను చాటి చెప్పే చిత్రమని దర్శకుడు క్రాంతి మాధవ్ ఈ సందర్భంగా తెలిపారు. సన్నిహిత్వానికి కొత్త అర్థాన్ని ఇచ్చేలా సినిమా తెరకెక్కుతున్నది అని చెప్పారు. ఈ సినిమా టైటిల్ రివీల్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన సందీప్ రెడ్డి వంగా టీమ్‌కు అభినందనలు తెలిపారు. పోస్టర్ ఆకట్టుకొనేలా చాలా బాగుంది. ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికి మంచి పేరు, లాభాలను పంచాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications











