దర్శకుడు సందీప్ రెడ్డి వంగ చేతుల మీదుగా మై డియర్ మార్తాండం ట్రైలర్

టాలీవుడ్ కమెడియన్ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, రాకేందు మౌళి, కల్పికా గణేష్, జయ ప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, తాగుబోతు రమేష్, కళ్యాణ్ విటపు కీలక పాత్రల్లో నటించిన కోర్టు రూం డ్రామాగా తెరకెక్కిన చిత్రం మై డియర్ మార్తాండం. ఈ సినిమా ట్రైలర్‌ను అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ విడుదల చేశారు.

ట్రైలర్ రిలీజ్ అనంతరం సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ.. ట్రైలర్ చూస్తుంటే ఔట్ అండ్ ఔట్ కామెడీగా సినిమా తెరకెక్కినట్టు కనిపించింది. ట్రైలర్ చాలా బాగుంది. పృథ్వి కామెడీ టైమింగ్ గురించి మనందరికీ తెలిసిందే. సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

Sandeep Reddy Vanga unveils My dear Marthandam trailer

హీరో రాకేందు మౌళి మాట్లాడుతూ మా సినిమా ఆద్యంత కామెడీతో సాగుతుంది. కామెడీ, సస్పెన్స్ జోనర్లో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొంటుది. చాలా బాగుంటుంది అని తెలిపారు.

హీరోయిన్ కల్పికా గణేష్ మాట్లాడుతూ దర్శకుడు హరీష్ కె.వి గారు మంచి పాయింట్ తో ఈ సినిమాను తీశారు. సస్పెన్స్ డ్రామా లో సినిమా నడుస్తుంది. మీ అందరికి నచ్చుతుంది అన్నారు. హీరో కళ్యాణ్ విటపు మాట్లాడుతూ మంచి సినిమాను తీసాం, ఈ క్రిస్మస్ కి మిమ్మల్ని నవ్వించేందుకు వస్తున్నాం అన్నారు.

దర్శకుడు హరీష్ కె.వి మాట్లాడుతూ.. కోర్ట్ రూం డ్రామా, కామేడి ఇంటరాగేషన్స్ బ్యాక్డ్రాప్ లో కథ నడుస్తుంది, సినిమా లో పృథ్వి గారి కామెడి చాలా బాగా వచ్చింది. ఈ డిసెంబర్ 29న వస్తున్నాం. ప్రేక్షకులు ఆధరించి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను అని తెలిపారు.

సుదర్శన్, హరీష్ కోయలగుండ్ల, మహేష్ విట్టా. గోకుల్, భరద్వాజ్, జబర్దస్త్ ప్రసాద్ లు మిగతా తారాగణంగా నటించిన ఈ సినిమాకు సంగీతం : పవన్. లిరిక్స్ : వెన్నలకంటి, రాకేందు మౌళి. ఎడిటర్ : గ్యారీ బీహెచ్, ఆర్ట్ డైరెక్టర్ : ప్రవీణ్, డీవోపీ: రామ్ రెడ్డి, నిర్మాత : సయ్యద్ నిజాముద్దీన్, రచన, దర్శకత్వం : కె.వి.హరీష్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X