ప్రభాస్ స్పిరిట్ తో పాటు మరో మూవీ.. సందీప్ వంగా ప్లానింగ్ మామూలుగా లేదుగా!

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అత్యంత క్రేజీ దర్శకుల జాబితాలో ముందు వరుసలో వినిపించే పేరు సందీప్ రెడ్డి వంగా. 'అర్జున్ రెడ్డి'తో సంచలనం సృష్టించిన ఆయన, 'కబీర్ సింగ్'తో బాలీవుడ్‌ను షేక్ చేశాడు. 'యానిమల్'తో పాన్ ఇండియా స్థాయిలో తన మార్క్‌ను చూపించారు. ప్రస్తుతం ప్రభాస్‌తో 'స్పిరిట్' వంటి భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్న సందీప్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఇలాంటి సమయంలో ఆయన నుంచి వచ్చిన మరో సర్‌ప్రైజ్ అనౌన్స్‌మెంట్ ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

సాధారణంగా సందీప్ వంగా పేరు వినగానే ఇంటెన్స్ ఎమోషన్స్, స్ట్రాంగ్ క్యారెక్టర్స్, విభిన్న కథలు గుర్తుకు వస్తాయి. కానీ ఈసారి ఆయన పూర్తిగా భిన్నమైన జానర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు. అయితే దర్శకుడిగా కాదు.. సమర్పకుడిగా. 'రోమాంచకం' అనే మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ చిత్రాన్ని ఆయన సమర్పిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

Sandeep Reddy Vanga s Master Plan While Spirit Rolls Romanchakam Sparks Excitement

ఇప్పటికే 'స్పిరిట్' వంటి భారీ సినిమా పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ, మరోవైపు కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు సందీప్ ముందుకు రావడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా ఆయనలాంటి స్టార్ డైరెక్టర్ ఒక కథ విని, దానిపై నమ్మకం ఉంచి తన పేరును జత చేయడం చిన్న విషయం కాదు. అందుకే 'రోమాంచకం' ప్రకటించగానే సినిమాపై ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది.

తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకుంది. పోస్టర్‌లో కనిపించిన ఫింగర్ హార్ట్ సింబల్, కలర్‌ఫుల్ డిజైన్, యూత్‌ఫుల్ వైబ్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. పోస్టర్‌పై ఉన్న 'ప్రేమ.. హాస్యం.. ఉత్కంఠ' అనే ట్యాగ్‌లైన్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇది కేవలం రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మాత్రమే కాదని, ప్రేమతో పాటు భావోద్వేగాలు, థ్రిల్ కూడా ఉంటాయని మేకర్స్ సూచిస్తున్నారు.

ఈ సినిమాలో 'మేం ఫేమస్' ఫేమ్ సుమంత్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, '8 వసంతాలు' ఫేమ్ అనంతిక సనిల్ కుమార్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. యువతలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ జంట కొత్త తరహా ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ముఖ్యంగా 'మేం ఫేమస్' తర్వాత సుమంత్ ప్రభాస్ నుంచి మరో మంచి సినిమా కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. 'గోదారి గట్టు' తర్వాత ఆయన కెరీర్‌కు ఈ సినిమా కీలకంగా మారనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి విషయానికి వస్తే.. ఇది ఆయనకు పెద్ద అవకాశంగా చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి సినిమాకే సందీప్ వంగా వంటి దర్శకుడి మద్దతు దక్కడం అరుదైన విషయం. కథ చెప్పినప్పటి నుంచి తాను నవ్వుకుంటూనే ఉన్నానని, అదే సమయంలో కథలో స్ట్రాంగ్ ఎమోషనల్ టచ్ కూడా ఉందని సందీప్ స్వయంగా చెప్పడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది.

'రోమాంచకం'కు సంగీత దర్శకుడు వాసుకి వైభవ్ పనిచేస్తున్నారు. ఇటీవల యువతను ఆకట్టుకునే సంగీతాన్ని అందిస్తున్న ఆయన, ఈ సినిమాకు కూడా ప్రత్యేకమైన ఆల్బమ్ ఇవ్వబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. సినిమాటోగ్రాఫర్ పవన్ పప్పుల విజువల్స్ కూడా ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. 'రోమాంచకం' కేవలం మరో యూత్‌ఫుల్ లవ్ స్టోరీ కాదు. సందీప్ వంగా బ్రాండ్ జత కావడంతో దీనికి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొత్త దర్శకులు, కొత్త కథలు, యువ నటీనటులకు వంగా బ్రదర్స్ వేదిక కల్పించడం కూడా ప్రశంసించదగ్గ విషయమే. ఇలా ఒకవైపు ప్రభాస్‌తో 'స్పిరిట్' వంటి భారీ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తూనే, మరోవైపు 'రోమాంచకం' వంటి చిన్న కానీ ఆసక్తికరమైన సినిమాకు అండగా నిలవడం సందీప్ వంగా దూరదృష్టికి నిదర్శనం. విడుదలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, టైటిల్ పోస్టర్‌తోనే ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X