సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్.. నాంపల్లి కోర్టుకు హాజరు విషయంలో..

ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. 2024, ఫిబ్రవరి 4వ తేదీ రాత్రి 'పుష్ప 2' ప్రివ్యూ షో సందర్భంగా.. హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ అభిమాని ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు చిక్కడపల్లి పోలీసులు, ఈ కేసులో దర్యాప్తు జరిపి, తాజాగా నాంపల్లి కోర్టులో కీలకమైన ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు. ఈ ఛార్జ్‌షీట్‌లో పోలీసులు మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఈ కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా (A11) పోలీసులు చేర్చడం గమనార్హం.

Also Read
Peddi Day 18 Box Office: వీకెండ్‌తో మళ్లీ పుంజుకున్న పెద్ది.. 18 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?
Peddi Day 18 Box Office: వీకెండ్‌తో మళ్లీ పుంజుకున్న పెద్ది.. 18 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే?

గతంలో ఈ కేసులో అల్లు అర్జున్ తో పాటు సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేసి, ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌తో పాటు ఇతర నిందితులకు కోర్టు సమన్లు జారీ చేసింది. కేసు ట్రయల్స్ నేపథ్యంలో నిందితులంతా వ్యక్తిగతంగా కోర్టుకు ప్రత్యేక్షంగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ జూన్ 22 (సోమవారం) నాంపల్లి కోర్టు ముందు ముందుకు రావాల్సింది, అయితే, ప్రస్తుతం అల్లు అర్జున్ ముంబైలో షూటింగ్‌ షెడ్యూల్‌లో బిజీగా ఉండటం వల్ల ఆయన స్వయంగా హాజరయ్యే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఆయన న్యాయ బృందం కోర్టును కోరిందట.

Recommended For You
ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌తో విష్ణుప్రియ జాక్‌పాట్.. ఆమె నెల సంపాదన ఎన్ని లక్షలో తెలుసా?
ఇన్‌స్టా సబ్‌స్క్రిప్షన్‌తో విష్ణుప్రియ జాక్‌పాట్.. ఆమె నెల సంపాదన ఎన్ని లక్షలో తెలుసా?
Sandhya Theatre Case Allu Arjun Seeks Exemption From Personal Court Appearance

అల్లు అర్జున్ న్యాయ బృందం వివరాల ప్రకారం.. ముంబైలో కొనసాగుతున్న సినిమా షూటింగ్ కారణంగా ప్రత్యక్షంగా కోర్టుకు హాజరుకావడం సాధ్యం కాకపోవడంతో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొనేందుకు అనుమతి కోరారు. కోర్టు ఆ మేరకు అనుమతి ఇవ్వడంతో ఆయన వర్చువల్‌గా హాజరుకానున్నారు. ఇక సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు దాఖలు చేసిన కేసులో అల్లు అర్జున్‌ను నిందితుల జాబితాలో A11 (Accused No.11)గా చేర్చారనీ, అలాగే సంధ్య థియేటర్ యాజమాన్యానికి చెందిన వ్యక్తులను A1 నుంచి A10 వరకు నిందితులుగా చేర్చినట్టు పేర్కొన్నారు.

You May Also Like
రణవీర్ సింగ్‌ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా? ప్రభాస్, షారుక్, బన్నీ రికార్డులు బ్రేక్!
రణవీర్ సింగ్‌ రెమ్యూనరేషన్ అన్ని కోట్లా? ప్రభాస్, షారుక్, బన్నీ రికార్డులు బ్రేక్!

ఈ కేసులో మొత్తం 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. విచారణలో భాగంగా అందరూ కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణపై సినీ, రాజకీయ వర్గాలతో పాటు అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. సోమవారం (నేడు) నాంపల్లి కోర్టులో జరిగే విచారణలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది ఉత్కంఠగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X