సంధ్య థియేటర్ ఘటన .. రష్మికని రేవతి భర్తకి ఇచ్చి పెళ్లి చేయాలంటూ డిమాండ్
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ - ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప 2 ది రూల్ విడుదల సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో రేవతి అనే వివాహిత ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు ఆసుపత్రిలో చావు బతుకుల్లో ఉన్నాడు. ఈ ఘటన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
ఈ ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్, హీరో వ్యక్తిగత భద్రత సిబ్బందిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఏకంగా హీరో అల్లు అర్జున్ అరెస్ట్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. జైలు నుంచి తిరిగొచ్చాక తన ఇంట్లో ఆయన బల ప్రదర్శనకు దిగడం, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి నేరుగా అసెంబ్లీలో చేసిన కామెంట్స్ , ఆ వెంటనే బన్నీ ప్రెస్ మీట్ పెట్టడం, తొక్కిసలాట ఘటనకు సంబంధించి వీడియోలు బయటకు రావడం కలకలం రేపాయి.

సంధ్య థియేటర్ దుర్ఘటన నేపథ్యంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు పెద్ద సినిమాలకు టికెట్ల ధరల పెంపు.. స్పెషల్ షో, బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చేది లేదని రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తేల్చిచెప్పారు. దీంతో ఇండస్ట్రీ మొత్తం ఆయనను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉంది. మరోవైపు.. తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధిత కుటుంబానికి రూ.2 కోట్ల సాయం అందజేయనున్నట్లుగా నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. కిమ్స్ ఆషుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను అల్లు అరవింద్, దిల్ రాజు, పుష్ప2 నిర్మాత రవిశంకర్‌లు పరామర్శించారు.
ఈ సందర్భంగా అల్లు అర్జున్ తరపున రూ. కోటి, డైరెక్టర్ సుకుమార్ రూ. 50 లక్షలు, మైత్రీ మూవీ మేకర్స్ రూ. 50 లక్షలు చొప్పున మొత్తంగా రూ. 2 కోట్ల చెక్‌లను దిల్ రాజుకు అందజేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్నాడని.. వెంటిలేషన్ తీసేశారని అల్లు అరవింద్ తెలిపారు. అన్ని రకాల అనుమతులు తీసుకుని శ్రీతేజ్‌ను పరామర్శించినట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని అల్లు అరవింద్ చెప్పారు.
ఇదిలాఉండగా.. రేవతి కుటుంబాన్ని సరైన విధంగా ఆదుకోవాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం , మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అల్లు అరవింద్ , అల్లు అర్జున్, మైత్రీ మూవీ మేకర్స్‌లు రేవతి కుటుంబానికి ఆర్ధిక సాయం అందిస్తున్నారు. అయితే అది సరిపోదని రేవతి భర్తకు హీరోయిన్ రష్మికను ఇచ్చి పెళ్లి చేయాలని వింత ప్రతిపాదనలు చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











