‘F3’ మూవీలో సీనియర్ హీరోయిన్: కీలక పాత్ర కోసం ఎంట్రీ ఇస్తున్న నటి

తెలుగు సినీ ఇండస్ట్రీలో కొంత కాలంగా మల్టీస్టారర్ మూవీలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన చిత్రాల్లో 'F2' (ఫన్ అండ్ ఫ్రస్టేషన్) ఒకటి. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటించిన ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించాడు. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించాడు. ఇందులో తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ఇద్దరు హీరోలు వివాహం తర్వాత ఎదుర్కొన్న పరిస్థితులను ఫన్నీగా చూపిస్తూ ఈ సినిమాను రూపొందించారు. ఇది ఘన విజయాన్ని అందుకోవడంతో దీనికి సీక్వెల్‌ను కూడా తీస్తున్నారు.

మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అవడంతో.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న 'F3'ని దానికి మించేలా రూపొందిస్తున్నాడు అనిల్ రావిపూడి. ఇందులో భాగంగానే ఈ చిత్రంలో ఎక్స్‌స్ట్రా ఫన్‌ను యాడ్ చేసేందుకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే కమెడియన్ సునీల్‌ను ఇందులో భాగం చేశాడు. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో సీనియర్ హీరోయిన్ సంగీత కీలక పాత్రను చేయబోతుందట. ఇప్పటికే ఆమెతో అనిల్ రావిపూడి సంప్రదింపులు కూడా జరిపాడని, దీనికి ఓకే కూడా చెప్పిందని తెలిసింది.

Sangeetha Key Role In F3 Movie

గత ఏడాది మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం 'సరిలేరు నీకెవ్వరు'. ఇందులో సంగీత హీరోయిన్ తల్లిగా నటించింది. దీని తర్వాత ఆమె 'F3'లోనే కీలక పాత్రను పోషించేందుకు రెడీ అయిందని సమాచారం. ఇక, ఈ సినిమా విషయానికి వస్తే.. ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ పరిస్థితులు చక్కపడేంత వరకూ చిత్రీకరణను పున: ప్రారంభించే అవకాశాలు లేవని చిత్ర యూనిట్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఇక, ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడిందని అనిల్ రావిపూడి వెల్లడించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X