‘ఆచార్య’లో సంగీతది గెస్ట్ రోల్ కాదట: బయటకు వచ్చిన సర్‌ప్రైజింగ్ న్యూస్

టాలీవుడ్ టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఆచార్య'. దేవాదాయ భూముల ఆక్రమణల నేపథ్యంతో సందేశాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని హై లెవెల్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని సంగీత పాత్ర గురించి ఓ సర్‌ప్రైజింగ్ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.

కొద్ది రోజుల క్రితం 'ఆచార్య' మూవీ నుంచి లాహే లాహే అంటూ సాగే ఓ పాట విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో సీనియర్ హీరోయిన్ సంగీత తళుక్కున మెరిసింది. దీంతో ఈ చిత్రంలో ఆమె నటిస్తుందా? లేక ఈ పాటకే పరిమితమైందా అని చర్చలు సాగాయి. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో సంగీతం అత్యంత కీలకమైన ధర్మస్థలి నర్తకి పాత్రను పోషిస్తుందట. ఎంతో హైలైట్‌గా ఉండే ఈ రోల్.. ఇంటర్వెల్‌కు ముందు జరిగిన ఓ యాక్షన్ సీన్‌లో చనిపోతుందని తెలుస్తోంది. కానీ, ఉన్నంత వరకూ ఆమె అద్భుతమైన యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేస్తుందనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

Sangeetha Krish Role Highlight in Acharya

భారీ బడ్జెట్.. ఉన్నత విలువలతో రూపొందుతోన్న 'ఆచార్య' షూటింగ్ కొంత భాగం చిత్రీకరణ జరగాల్సి ఉంది. అది ఈ నెల చివర్లోనే వచ్చే నెల ఆరంభంలోనే జరుగుతుందని తెలుస్తోంది. అది అయిన వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి.. వీలైనంత త్వరగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్రయత్నాలు జరుపుతున్నారట. ఇక, ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ఇందులో హీరోయిన్లుగా చేస్తోన్నారు. ఈ సినిమాకు మెలోడీ కింగ్ మణిశర్మ సంగీతం సమకూర్చుతున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X