ఆ విషయంలో షోయబ్ వీక్.. అందుకే.. బ్రేకప్ తర్వాత సానియా మిర్జా వీడియో వైరల్!
పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను ఇండియన్ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా వివాహం చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎంగేజ్‌మెంట్ బ్రేకప్ చేసుకొన్న ఆమె.. అప్పటికే మొదటి వివాహమైన షోయబ్‌ను పెళ్లి చేసుకోవడం ఏమిటనే ప్రశ్న మీడియాలో ప్రశ్నార్థకంగానే కాకుండా తీవ్రమైన ట్రోల్స్ చేశారు. అయితే తాజాగా సానియాకు విడాకులు ఇచ్చి పాకిస్థాన్ నటి సనా జావెద్‌ను షోయబ్ మాలిక్ మూడో మ్యారేజ్ చేసుకోవడం షాకింగ్‌గా మారింది. అయితే షోయబ్ మాలిక్‌ను ఎందుకు పెళ్లి చేసుకొన్నాననే సానియా చెప్పిన వీడియో క్లిప్ వైరల్ అవుతున్నది. ఆ వీడియో వివరాల్లోకి వెళితే..
షోయబ్ మాలిక్ తొలి వివాహం కూడా వివాదాస్పదంగానే ముగిసింది. 2002 సంవత్సరంలో ఆయేషా సిద్దిఖీ అనే హైదరాబాదీ అమ్మాయిని ఫోన్‌లో వివాహం చేసుకొన్నాడు. ఆ తర్వాత సానియా మిర్జాను వివాహం చేసుకోగానే తాను షోయబ్‌కు మొదటి భార్యను అని కేసు ఫైల్ చేసింది. దాంతో సానియాతో పెళ్లికి ముందు అత్యంత వివాదాస్పదమైంది.

సానియా మిర్జాను వివాహం చేసుకోవడానికి ముందు ఆయేషాతో రాజీ చేసుకొన్నారు. భరణం కింద భారీగా కొన్ని కోట్ల రూపాయలను ఆమెకు ఇచ్చి తలాక్ తీసుకొన్నాడు. దాంతో ఆ వివాదానికి ఎండ్ కార్డు పడింది. ఆ తర్వాత సానియాను పెళ్లి చేసుకొని మరోసారి హైదరాబాద్ అల్లుడిగా షోయబ్ మారిపోయాడు.
షోయబ్ మాలిక్‌తో పెళ్లి తర్వాత సానియా దుబాయ్‌లో స్థిరపడింది. వారి కాపురం సవ్యంగా సాగుతుందని భావిస్తున్న సమయంలోనే విడిపోతున్నారనే వార్త మీడియాలో బాంబులా పేలింది. కొద్ది రోజులుగా వారిద్దరూ మౌనం దాల్చడంతో ఆ వార్తకు రకరకాల ట్విస్టులు వచ్చాయి.

అయితే తాజాగా పాకిస్థానీ సీరియల్ యాక్టర్ సనా జావెద్‌ను వివాహం చేసుకోవడంతో సానియా, షోయబ్ దాంపత్య జీవితానికి ముగింపు పలికిన్లయింది. అయితే ఈ విషయంపై సానియా ఫ్యామిలీ మీడియాకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈ విషయంపై వారు స్పందిస్తే ఏం జరిగిందనే విషయంపై క్లారిటీ వస్తుంది.
ఇదిలా ఉండగా, గతంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌తో ఓ ఫంక్షన్‌లో సానియా, షోయబ్ కలిశారు. ఆ సందర్బంగా దేశ పరిస్థితులను ఎదురించి షోయబ్‌ను ఎందుకు పెళ్లి చేసుకొన్నావు అని సానియాను షారుక్ అడిగాడు. దాంతో అతడిలో నేను చాలా చూశాను. మాట్లాడే విషయంలో చాలా సిగ్గుపడుతాడు. అలా ఆ విషయంలో సిగ్గుపడకుండా నీవే ఏదైనా నేర్పించాలి అని కింగ్ ఆఫ్ రొమాన్స్ షారుక్‌తో సానియా అంటే.. ఆ విషయం నాకు వదిలేయ్ అంటూ షారుక్ బదులు ఇచ్చాడు. అయితే నీవు సానియాను ఎందుకు పెళ్లి చేసుకొన్నావని అడిగిన ప్రశ్నకు.. ఆలోచించే లోపే పెళ్లి జరిగిపోయింది అని షారుక్‌కు షోయబ్ చెప్పాడు. వీడియో ప్రస్తుతం వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











