సంజయ్ దత్‌పై రూమర్లను నమ్మొద్దు.. ఆయన ఓ ఫైటర్.. భార్య మాన్యత ఎమోషనల్

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ క్యాన్సర్ బారిన పడ్డారనే విషయం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేస్తున్నది. సంజూకు క్యాన్సర్ అనే వార్త బయటకు తెలియగానే త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు, సన్నిహితులు, స్నేహితులు ప్రార్థిస్తున్నారు. అయితే ఇలాంటి భావోద్వేగాల మధ్య భార్య మాన్యత ఎమోషనల్‌గా స్పందించారు. సంజయ్ దత్ మనోబలం, ఆరోగ్యంపై వస్తున్న రూమర్ల గురించి మాన్యత దత్ స్పందిస్తూ..

సంజయ్ ఆరోగ్యంపై రూమర్లు

సంజయ్ ఆరోగ్యంపై రూమర్లు

సంజయ్ దత్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఆరోగ్యం మరింత దిగజారే పరిస్థితి ఉంది అంటూ వస్తున్న వార్తలపై మాన్యత దత్ స్పందించారు. సంజూ ఆరోగ్యం గురించి ప్రార్థిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలు, రూమర్లను నమ్మకండి. ఆయనపై ప్రేమను కురిపిస్తూ మానసిక దైర్యాన్ని ఇవ్వండి అంటూ మాన్యత తెలిపారు.

సంజూ ఓ ఫైటర్.. మరో కఠిన పరీక్ష

సంజూ ఓ ఫైటర్.. మరో కఠిన పరీక్ష

సంజూ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. అయినా ధైర్యంగా ఎదురించి నిలిచాడు. సంజు ఎప్పడూ గొప్ప ఫైటర్. మా కుటుంబానికి దేవుడు మరో కఠిన పరీక్ష పెట్టారు. ఈ పరీక్షను కూడా సునాయసంగా అధిగమిస్తాం. ఇలాంటి సమయంలో సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది అని మాన్యత తెలిపారు.

సంజయ్ దత్ రియాక్షన్

సంజయ్ దత్ రియాక్షన్

తన ఆరోగ్యంపై వస్తున్న రూమర్లపై సంజయ్ దత్ ట్విట్టర్‌లో పోస్టు పెట్టారు. మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం సినిమా షూటింగులకు దూరంగా ఉండాలని నిర్ణయించుకొన్నాను. ఈ సమయంలో నా ఫ్యామిలీ, స్నేహితులు నా వెంట ఉన్నారు. నా ఆరోగ్యం గురించి బెంగ పడొద్దు. ఊహాగానాలను నమ్మవద్దు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ముందుకొస్తాను అని సంజయ్ దత్ పేర్కొన్నారు.

లీలావతిలో క్యాన్సర్ వ్యాధి గుర్తింపు

లీలావతిలో క్యాన్సర్ వ్యాధి గుర్తింపు

కొద్ది రోజలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంజయ్ దత్ ఇటీవల కరోనా టెస్టులు చేయించుకోగా నెగిటివ్‌గా తేలింది. అయితే ఆయనకు శ్వాస సంబంధింత సమస్యలు తలెత్తడంతో శనివారం లీలావతి హాస్పిటల్‌లో చేరారు. లీలావతీ వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ జరిగింది. ప్రస్తుతం అమెరికాలో చికిత్స కోసం వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు.

Recommended Video

Vyjayanthi Movies Recalls SR NTR Humble Nature Towards Producers
సడక్ 2, కేజీఎఫ్ 2 చిత్రాల్లో

సడక్ 2, కేజీఎఫ్ 2 చిత్రాల్లో

ఇక సంజయ్ దత్ కెరీర్ విషయానికి వస్తే.. సడక్ 2 చిత్రం ఆగస్టు 28వ తేదీన డిస్నీ+హాట్‌స్టార్‌లో రిలీజ్ కానున్నది. సడక్ 2 తర్వాత సంజయ్ దత్ నటించిన కేజీఎఫ్2 చిత్రం విడుదలకు సిద్దమవుతున్నది. ఈ చిత్రంలో అధీరా పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను ఇటీవల ఆయన జన్మదినం రోజున రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రవీనా టాండన్, శ్రీనిధి శెట్టి నటించారు. కేజీఎఫ్ చిత్రానికి దర్శకత్వం వహించిన ప్రశాంత్ నీల్ ఈ చిత్రానికి కూడా డైరెక్టర్‌గా వ్యవహరించడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X