ప్రభాస్ మూవీలో దెయ్యంగా స్టార్ హీరో: సినిమాలో ఆ సీన్సే హైలైట్

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోనే అయినా.. దేశ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తూ పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. దీంతో తన రేంజ్‌ను క్రమంగా పెంచుకునేందుకు వరుసగా భారీ బడ్జెట్ సినిమాల్లోనే నటిస్తూ ముందుకు సాగుతోన్నాడు. ఇలా ఇప్పుడు ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్టు K', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్', సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్‌లో ఓ భారీ యాక్షన్ చిత్రాల్లో నటిస్తోన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే ఎన్నో హై రేంజ్ ప్రాజెక్టులను ప్రకటించిన ప్రభాస్.. ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో 'రాజా డీలక్స్' (పరిశీలనలో ఉన్న పేరు) అనే సినిమాలో కూడా చేస్తున్నాడు. ఈ మూవీ హర్రర్ కామెడీతో రాబోతుందని ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. ఈ సినిమా పూజా కార్యక్రమాలు గత అక్టోబర్ 17వ తేదీ జరిగాయి. ఆ వెంటనే ఓ భారీ బంగ్లా సెట్‌ను రూపొందించిన చిత్ర యూనిట్ మొదటి షెడ్యూల్‌ను ప్రారంభించి కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించింది. దీనికి సంబంధించిన పిక్ కూడా బయటకు వచ్చింది. అయితే, ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌కు గ్యాప్ వచ్చింది.

Sanjay Dutt Ghost Role in Prabhas and Maruthi Movie

క్రేజీ కాన్సెప్టుతో రాబోతున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నారని ఇప్పటికే ఓ న్యూస్ రివీల్ అయింది. ఈ మూవీలో ఈ సీనియర్ హీరో ప్రభాస్‌కు తాతగా కనిపించబోతున్నట్లు కూడా తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. సంజయ్ దత్ ఈ మూవీలో దెయ్యంగా కూడా కనిపించబోతున్నారని తెలిసింది. ప్రభాస్ తాత చనిపోయిన తర్వాత అదే బంగ్లాలో ఆత్మగా ఉంటూ భయపెట్టబోతున్నారని సమాచారం. ఈ సీన్స్ అన్నీ ఆకట్టుకునే విధంగా ఉంటాయని టాక్.

Sanjay Dutt Ghost Role in Prabhas and Maruthi Movie

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ఇప్పటికే తెలిసింది. ఇక, ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X