కరోనా నెగెటివ్ కానీ.. తీవ్ర అస్వస్థతతో సంజయ్ దత్ లీలావతిలో చేరిక

అసలే దేశ వ్యాప్తంగా కరోనా తాండవం చేస్తోంది. ఈ క్రమంలో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరినీ కరోనా మహమ్మారి భయపెడుతోంది. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబై నగరాన్ని కరోనా పట్టి పీడిస్తోంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీనే కరోనా వదిలి పెట్టలేదు. ఎట్టకేలకు బచ్చన్ ఫ్యామిలీ అంతా కరోనా నుంచి బయటపడ్డారు. అయితే తాజాగా బాలీవుడ్ పెద్దన్న, దాదా సంజయ్ దత్ హాస్పిటల్‌లో చేరిన విషయం అందర్నీ కలవరపరుస్తోంది.

Sanjay Dutt joined in Lilavati Hospital Due To Breathing Problem

కొన్ని గంటల క్రితమే సంజయ్ దత్.. లీలావతి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. సంజూ దాదాకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితం మాత్రం నెగెటివ్‌గా వచ్చింది. ఊపిరి పీల్చుకోవడం, ఊపిరితిత్తుల్లో సమస్యగా ఉండటంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారట. అయితే సంజయ్ దత్‌ ఆరోగ్యంగా తిరిగి రావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సంజయ్ దత్ లాక్ డౌన్ సమయంలో ఎంత హుషారుగా ఉన్నాడో అందరికీ తెలిసిందే.

లాక్ డౌన్‌లో డెయిలీ జిమ్, వర్కవుట్లు చేస్తూ అందర్నీ ఇన్‌స్పైర్ చేశారు. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇక రీసెంట్‌గా సంజయ్ దత్ సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. కేజీయఫ్ చాప్టర్ 2 చిత్రంలోని అధీరా లుక్‌తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అతి క్రూరమైన వ్యక్తిలా కనిపించిన అధీరా గెటప్ సంజయ్ దత్‌కు పర్ఫెక్ట్‌గా సెట్ అయిందని కామెంట్స్ వినిపించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X