KGF 2: సంజయ్ దత్ బర్త్ డే లుక్ వైరల్.. క్రూరమైన 'అధిరా'
బగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న KGF 2 పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హీరో యష్ క్రేజ్ ని ఒక్కరోజులోనే అమాంతంగా పెంచేసిన సినిమా KGF చాప్టర్ 1. ఆ మూవీ ఇచ్చిన బాక్సాఫీస్ దెబ్బకు ఒక్కసారిగా బాలీవుడ్ ఎనలిస్ట్ లు కూడా షాక్ కి గురయ్యారు. అసలు ఒక కన్నడ సినిమా ఈ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవరు ఉహీంచలేదు.
ఇక సెకండ్ పార్ట్ పై పెరుగుతున్న అంచనాలకు తగ్గట్టుగానే చిత్ర యూనిట్ కూడా బజ్ పెంచుతోంది. KGF 2లో సంజయ్ దత్ మెయిన్ విలన్ అధిరా అనే పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. అయితే అతనికి సంబంధించిన లుక్ ని బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. క్రూరమైన పాత్రలో కనిపించబోతున్నట్లు మొదటి లుక్కుతోనే షాక్ ఇచ్చిన చిత్ర యూనిట్ ఇప్పుడు మరో పోస్టర్ తో సినిమాపై అంచనాల డోస్ ని మరింత పెంచేసింది.
చూస్తుంటే సంజయ్ పాత్ర సినిమాలోనే మెయిన్ హైలెట్ అయ్యేలా ఉందనిపిస్తోంది. అధిరా అనే పాత్రను మొదటి పార్ట్ లో సీక్రెట్ గా ఉంచిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఆ సినిమా సాధించిన విజయం కారణంగా ఇప్పుడు సెకండ్ పార్ట్ లో మరో లెవెల్ లో ఉండేలా పాత్రని డిజైన్ చేస్తున్నాడు. ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ లాల్ డౌన్ కారణంగా షూటింగ్ బ్రేక్ వేసింది.

ఇక కరోనా అదుపులోకి వచ్చిన తరువాత వీలైనంత త్వరగా మిగతా షూటింగ్ పనులను ముగించుకోవాలని చూస్తున్నారు. అసలైతే ఇదే ఏడాది చివరలో సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలించకపోవడంతో KGF 2ను వచ్చే ఏడాదిలోనే రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మరి సినిమా రిలీజ్ తరువాత ఏ స్థాయిలో హిట్టవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











