SSMB28: మహేశ్ మూవీలో మరో స్టార్ హీరో.. ఆయన చేసే పాత్రపైనా క్లారిటీ వచ్చేసిందిగా!
తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్‌లు ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంటాయి. అందుకే ఆయా కాంబోలలో సినిమాలు రావాలని వాళ్ల ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులంతా ఆసక్తిగా వేచి చూస్తూ ఉంటారు. అలాంటి కలయికల్లో టాలీవుడ్ బడా హీరో సూపర్ స్టార్ మహేశ్ బాబు.. సీనియర్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబో ఒకటి. గతంలో వీళ్లిద్దరూ కలిసి 'అతడు', 'ఖలేజా' వంటి చిత్రాలను చేశారు. ఇవి వచ్చి చాలా కాలమే అవుతోన్న మూడో సినిమా మాత్రం రాలేదు. అందుకే మహేశ్, త్రివిక్రమ్ మళ్లీ జోడీ కట్టి అదిరిపోయే చిత్రాన్ని చేయాలని చాలా కాలంగా అందరూ కోరుకుంటున్నారు.
ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం 'సర్కారు వారి పాట' అనే సినిమాను చేస్తున్నాడు. దీని తర్వాతి సినిమాను త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేస్తున్నాడు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొద్ది రోజుల క్రితమే వచ్చింది. దీంతో ఇరు స్టార్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. వాస్తవానికి త్రివిక్రమ్ తన కొత్త సినిమాను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌తో చేయాలని అనుకున్నాడు. కానీ, ఎందుకో అది ప్రకటనకే పరిమితం అయిపోయింది. దీంతో దాని స్థానంలో మహేశ్ బాబు మూవీని లైన్‌లో పెట్టాడు. ఇక, ఈ ప్రాజెక్టు పట్టాలెక్కకపోయినా.. దీని గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి.

మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుంది. అంతలో దీనికి సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయాలని దర్శకుడు భావిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పటికే డైలాగ్ వెర్షన్‌తో కూడిన స్క్రిప్టును రెడీ చేసి పెట్టేశాడు. అలాగే, ప్రీ ప్రొడక్షన్ పనులను సైతం దాదాపుగా కంప్లీట్ చేసేశాడు. ఈ క్రమంలోనే టెక్నీషియన్లను కూడా ఎంపిక చేసుకున్నాడు. ఇక, ఇప్పుడు నటీనటులపై దృష్టి సారించాడని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఫిలిం నగర్ ఏరియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్ కూడా నటిస్తున్నాడని చాలా రోజులుగా ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే, ఆయన ఈ సినిమాలో ఎలాంటి పాత్ర చేస్తున్నాడన్న దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఓ రాజకీయ నాయకుడి పాత్రను ఆయన చేస్తున్నారని తెలుస్తోంది. ఈ రోల్ నెగెటివ్ షేడ్స్ ఉంటుందని, ఇదే మెయిన్ విలన్ పాత్ర అని తాజాగా తెలిసింది. ఇప్పటికే ఇందులో నటించేందుకు సంజయ్ దత్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారని టాక్.
ఈ సినిమాలో మహేశ్ బాబు రా ఏజెంట్‌గా కనిపిస్తాడని అంటున్నారు. దీన్ని వచ్చే ఫిబ్రవరిలో పట్టాలెక్కిస్తారని అంటున్నారు. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక, ఈ చిత్రానికి 'పార్థు', 'అతడే పార్థు' అనే టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. దీనికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్‌గా ఏఎస్ ప్రకాశ్, కెమెరామెన్‌గా మథి, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్ థమన్ చేస్తున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











