SSMB28: మహేశ్ బాబుకు విలన్ ఫిక్స్.. ఆ హీరోనే ఫైనల్ చేసిన త్రివిక్రమ్
కొంత కాలంగా వరుసగా విజయాలను సొంతం చేసుకుంటూ కెరీర్‌లోనే భీకరమైన ఫామ్‌తో కనిపిస్తున్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఈ ఉత్సాహంతోనే అతడు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్నాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది 'సర్కారు వారి పాట' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి టాక్ బాగానే ఉన్నా కలెక్షన్లు మాత్రం పూర్తి స్థాయిలో రాలేదు. అయినప్పటికీ ఆ ఫలితాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు మహేశ్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. క్రేజీ కాంబోలో రూపొందుతోన్న ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.
'అతడు', 'ఖలేజా' వంటి క్రేజీ మూవీల తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రాబోతున్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభం అయింది. ఫస్ట్ షెడ్యూల్‌లో అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేసుకున్నారు. ఇదంతా అదిరిపోయేలా వచ్చిందని తెలుస్తోంది. ఇక, తల్లి ఇందిరా దేవి మరణంతో మహేశ్ బాబు తన సినిమా షూటింగ్‌కు కాస్త విరామం ప్రకటించాడు. ఇప్పుడు మళ్లీ ఈ మూవీ షూట్‌లో పాల్గొనబోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్ కూడా నటిస్తున్నాడట. సినిమాలోనే ఎంతో ప్రాధాన్యత ఉన్న ఓ రాజకీయ నాయకుడి పాత్రను ఆయన చేస్తున్నారని తెలుస్తోంది. ఈ రోల్ నెగెటివ్ షేడ్స్‌తో ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఇందులో నటించేందుకు సంజయ్ దత్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని సమాచారం. అందుకే ఇటీవలే తెలుగు సినిమాల్లో నటించాలని చాలా ఆసక్తిగా ఉన్నట్లు ఆయన చెప్పారని ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలిసింది.
ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే ఇందులో హీరోయిన్‌గా చేస్తోంది. థమన్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక, దీనికి 'అర్జునుడు', 'అతడే పార్థు' వంటి టైటిళ్లు పరిశీలనలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











