ప్రభాస్‌కు విలన్‌గా కేజీఎఫ్ స్టార్: వీళ్లిద్దరి కాంబినేషన్‌కు పూనకాలు ఖాయం
టాలీవుడ్‌లో తనదైన చిత్రాలతో సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ స్టార్‌గా వెలుగొందుతోన్నాడు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. అలా చాలా ఏళ్ల పాటు తెలుగు సినిమాలనే చేసిన అతడు.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో ఇంటర్నేషనల్ రేంజ్‌లో క్రేజ్‌ను సొంతం చేసుకున్న అతడు.. అప్పటి నుంచి భారీ చిత్రాల్లోనే భాగం అవుతూ సత్తా చాటుతోన్నాడు. ఇలా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్నాడు. ఇప్పటికే ప్రభాస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్టు K', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' అనే మూవీలు చేస్తున్నాడు.
ప్రభాస్ ప్రస్తుతం టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ మారుతితో 'రాజా డీలక్స్' (పరిశీలనలో ఉన్న పేరు) అనే సినిమా చేయబోతున్నాడని ఆ మధ్య ఓ న్యూస్ లీకైంది. అందుకు అనుగుణంగానే ఈ మూవీ హర్రర్ కామెడీతో రాబోతుందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత షూట్ ప్రారంభోత్సవం, ఫస్ట్ షెడ్యూల్ గురించి కూడా ఎంతో చర్చ జరిగింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా పూజా కార్యక్రమాలు అక్టోబర్ 17వ తేదీ జరిగాయని తెలిసింది. ఆ వెంటనే మొదటి షెడ్యూల్‌ను ప్రారంభించి కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించారనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

క్రేజీ కాంబినేషన్‌లో వైవిధ్యమైన కథతో రూపొందుతోన్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న సమాచారం ప్రకారం.. ఈ మూవీలో ప్రభాస్‌ను ఢీకొట్టే విలన్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నారట. ఇప్పటికే ఆయనతో చిత్ర యూనిట్ సంప్రదింపులు కూడా జరిపిందని తెలిసింది. ఇందుకు సంజయ్ పచ్చజెండా ఊపడంతో పాటు డేట్స్ కూడా కేటాయించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే కనుక నిజం అయితే వీళ్లిద్దరి కాంబినేషన్ స్క్రీన్‌పై పూనకాలు తెప్పిస్తుందనడంలో సందేహమే లేదు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మారుతి కలయికలో రాబోతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











