Don't Miss!
- Sports
Gongadi Trisha: ప్రపంచకప్ విజయం వెనుక తండ్రి త్యాగం!
- News
చంద్రబాబు, పవన్ కల్యాణ్ కు ఫోన్ చేసిన కన్నా?
- Lifestyle
జుట్టు ఎక్కువగా రాలుతుందా? అయితే కరివేపాకును ఇలా వాడితే మీ జుట్టు ఒత్తుగా, కాంతివంతంగా పెరుగుతుంది
- Technology
Moto Edge 40 ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ తేదీ వివరాలు లీక్! స్పెసిఫికేషన్లు కూడా..!
- Finance
Mega Bonus: కట్టలు కట్టలుగా డబ్బు.. ఈ కంపెనీ ఇచ్చిన బోనస్ చూస్తే కళ్లు తిరిగుతాయ్..!
- Automobiles
ప్యూర్ EV లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ బైక్ 'ecoDryft': ధర రూ. 99,999 మాత్రమే
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
ప్రభాస్ తాతగా స్టార్ హీరో కన్ఫార్మ్: వామ్మో ఇదేం ప్లానింగ్ బాబోయ్
బడా ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌తోనే సినిమాల్లోకి వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు ప్రభాస్. అలా సుదీర్ఘ కాలం పాటు తెలుగులో సత్తా చాటిన అతడు.. రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి'తో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. దీంతో అప్పటి నుంచి భారీ చిత్రాలనే చేస్తూ సత్తా చాటుతోన్నాడు. ఇలా ఇప్పటికే రెబెల్ స్టార్ ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్', ఓం రౌత్ తెరకెక్కిస్తోన్న 'ఆదిపురుష్', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్టు K', సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' అనే భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు.
Shrihan Remuneration: శ్రీహాన్ గెలిచింది 45 లక్షలు.. రెమ్యూనరేషన్ భారీగా.. ట్యాక్సులు పోను ఎంతంటే!
ఇప్పటికే నాలుగు క్రేజీ ప్రాజెక్టులను ప్రకటించిన ప్రభాస్.. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'రాజా డీలక్స్' (పరిశీలనలో ఉన్న పేరు) అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ మూవీ హర్రర్ కామెడీతో రాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇక, ఈ సినిమా పూజా కార్యక్రమాలు అక్టోబర్ 17వ తేదీ జరిగాయి. ఆ వెంటనే ఓ భారీ బంగ్లా సెట్‌ను రూపొందించిన చిత్ర యూనిట్ మొదటి షెడ్యూల్‌ను ప్రారంభించి కొన్ని కీలకమైన సన్నివేశాలను కూడా చిత్రీకరించింది. ఇప్పుడు కూడా పేరున్న నటీనటులతో ప్రభాస్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

వైవిధ్యమైన కథతో రూపొందుతోన్న ఈ సినిమా గురించి తాజాగా ఓ ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోన్న వార్తల ప్రకారం.. ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ నటిస్తున్నారట. ఆయన ఇందులో విలన్‌గా నటిస్తున్నట్లు గతంలో ప్రచారం జరిగింది. కానీ, ఈ మూవీలో ఈ సీనియర్ హీరో ప్రభాస్‌కు తాతగా కనిపించబోతున్నట్లు తెలిసింది. సినిమా సెకెండాఫ్‌లోని ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే సన్నివేశాల్లోనే ఆయన కనిపిస్తారని అంటున్నారు. సంజయ్ దత్ రోల్ మాత్రం ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందని చెబుతున్నారు.
Revanth Remuneration: రేవంత్‌కు షాకింగ్ రెమ్యూనరేషన్.. ప్రైజ్ మనీతో కలిపితే.. చేతికొచ్చింది మాత్రం!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - మారుతి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నట్లు ఇప్పటికే ఓ న్యూస్ లీకైంది. ఇక, ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఇందులో ఎంతో మంది ప్రముఖులు కీలక పాత్రలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.