twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రేమలో ఉన్నా.. కానీ ఎవరిని పెళ్లి చేసుకుంటానో తెలియదు: ప్రభాస్ హీరోయిన్ బోల్డ్ ఆన్సర్

    |

    సినీ ప్రపంచంలో డేటింగ్ అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ మధ్య కాలంలో హీరోయిన్స్ ప్రేమ పెళ్లిళ్లకే వంద శాతం ఓటేస్తున్నారు. కొందరు ప్రేమ వ్యవహారాలను చాటుమాటుగా ఉంచితే.. మరికొందరు మాత్రం బహిరంగంగానే లవ్ మ్యాటర్ ని భయటపెడుతున్నారు. రీసెంట్ గా ఒక హీరోయిన్ కూడా తన ప్రేమ గురించి అదే విధంగా చెబుతూ.. ఎవరు ఊహించని ఆన్సర్ ఇచ్చింది.

    బుజ్జిగాడు బ్యూటీ..

    బుజ్జిగాడు బ్యూటీ..

    పూరి జగన్నాథ్, ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి సినిమా బుజ్జిగాడు. ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ త్రిష అయినప్పటికీ సపోర్టింగ్ పాత్రలో కనిపించిన సంజన గల్రానికి మంచి గుర్తింపు దక్కింది. క్యూట్ గర్ల్ గా అమ్మడు ఓ వర్గం ఆడియేన్స్ ని బాగానే ఎట్రాక్ట్ చేసింది. నచ్చిన సినిమాలు చేసుకుంటూ అప్పుడప్పుడు కొన్ని బోల్డ్ కామెంట్స్ తో వార్తల్లో నిలుస్తోంది.

    కన్నడలో బిజీగా..

    కన్నడలో బిజీగా..

    తెలుగు సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈ బ్యూటీ ఎక్కువగా కన్నడ సినిమాలతోనే బిజీగా మారింది. మధ్య మధ్యలో తెలుగు సినిమాలు చేస్తూనే.. సొంత బాష కన్నడలో కూడా మంచి విజయాల్ని అందుకుంది. ఇక ఆ తరువాత మలయాళం భాషలో కూడా పలు విజయలని చూసిన ఈ బ్యూటీ తెలుగులో మాత్రం సరైన సక్సెస్ చూడలేకపోతోంది.

    మ్యారేజ్ రూమర్స్..

    మ్యారేజ్ రూమర్స్..

    ఇటీవల కాలంలో సంజన పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లు కథనాలు వచ్చాయి. ఈ బ్యూటీ చాలా రోజులుగా ఒక యువకుడితో ప్రేమలో ఉన్నట్లు కూడా రూమర్స్ వచ్చాయి. మొత్తానికి ఫ్యామిలీ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందని గాసిప్స్ రావడంతో సంజన కాస్త సీరియస్ అయ్యింది. అందులో ఏ మాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చింది.

    Recommended Video

    Aishwarya Rajesh Family Background & Her Struggling Career
    బోల్డ్ ఆన్సర్..

    బోల్డ్ ఆన్సర్..

    తన ప్రేమ వ్యవహారంపై స్పందించిన సంజన నిజానికి ప్రస్తుతం ఒక యువకుడితో లవ్ లో ఉన్నట్లు ఒప్పుకుంది. అయితే ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటానో లేదో తనకు తెలియదని.. అలాగే జీవితంలో ఎవరు ఎవరిని పెళ్లి చేసుకుంటారో ఎవరికీ తెలియదని.. ఈ బ్యూటీ బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది. దీంతో మరొకసారి సంజన కామెంట్స్ సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇకపోతే ప్రస్తుతం సంజన ఒక వెబ్ సిరిస్ లో నటిస్తోంది.

    English summary
    Actress Sanjjanaa Galrani, who made her acting debut with 2008 released Bujjigaadu is quite a noted name in Telugu and Tamil industries, in a recent lockdown interview, Sanjjanaa revealed that she may get married this year. While talking about her relationship status, 
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X