హీరోయిన్ సంజన అతి మాములుగా లేదే.. సుశాంత్ సూసైడ్ గురించి మాట్లాడుతూ లైవ్లో మేకప్!
కొంతమంది సినీ తారలు ప్రవర్తించే తీరు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణవార్తలపై అనేక రకాల వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే కొంతమందిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటనపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. అయితే ఒక హీరోయిన్ మాత్రం సందర్భం ఏమిటనే విషయాన్ని పట్టించుకోకుండా లైవ్ లో జనాలు చూస్తుండగానే కెమెరా ముందు మేకప్ వేసుకుంటూ అందాన్ని సరిచేసుకోవడం వివాదంగా మారింది. ఆమె తీరుపై నెటిజన్ల మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
Recommended Video

స్పెషల్ ఫోకస్ అవ్వడానికి ప్రయత్నం
సాధారణంగా కొంతమంది పరిస్థితులను బట్టి స్పందించడానికి ప్రయత్నం చేస్తే.. మరికొందరు మాత్రం విషయం ఏమిటనేది అర్థం చేసుకోకుండా స్పెషల్ ఫోకస్ అవ్వడానికి ప్రయత్నం చేస్తుంటారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఇటీవల ఒక స్టార్ హీరోయిన్ కూడా లైవ్ న్యూస్ ఛానెల్ లో అందరూ చూస్తుండగానే ఊహించని విదంగా ప్రవర్తించింది.

సుశాంత్ ఆత్మహత్య ఘటనపై
ఆ హీరోయిన్ మరెవరో కాదు.. బుజ్జిగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి దగ్గరైన సంజనా గల్రానీ. ఈ హీరోయిన్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని కాంట్రవర్సీ న్యూస్ లతో మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుందిమ్ ఇకపోతే ఇటీవల ఒక లైవ్ న్యూస్ ఛానెల్ లో సినీ తారలు లైవ్ లోకి వచ్చి సుశాంత్ ఆత్మహత్య ఘటనపై స్పందించగా సంజనా కూడా తన వివరణ ఇచ్చింది.
కెమెరాలోకి చూస్తూ టచప్
అయితే మధ్యలో ఎవరు చూడట్లేదు అనుకుందో లేక మారేమనుకుందో గాని ఎవరు ఊహించని విదంగా మేకప్ కిట్ బయటకు తీసింది. లైవ్ లో వేరే వాళ్ళు మాట్లాడుతున్న సమయంలో ఆమె కెమెరాలోకి చూస్తూ టచప్ చేసుకుంది. దీంతో సోషల్ మీడియాలో అందుకు సంబంధించిన వీడియో క్లిప్ , ఫొటోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.

నెటీజన్స్ విమర్శలు
సందర్భం ఏమిటో అర్థం చేసుకోకుండా సంజనా ఈ విధంగా ప్రవర్తించడంపై నెటీజన్స్ తీవ్ర స్థాయిలో విమర్శలు చూస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమెపై ఊహించని విదంగా ట్రోల్స్ కూడా నడుస్తున్నాయి. పరిస్థితిని అర్థం చేసుకోకుండా నీకున్న మేకప్ పిచ్చిని బయటపెట్టావ్ అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ కామెంట్స్ పై సంజనా ఏ విదంగా స్పందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











