డ్రగ్స్ కేసులో ఊరట.. సంజనా గల్రానీకి బెయిల్
కరోనా కాలంలో సినీ ఇండస్ట్రీలో ఎన్నో వివాదాలు బయటకు వచ్చాయి. మరీ ముఖ్యంగా బాలీవుడ్, శాండల్ వుడ్‌పై డ్రగ్స్ మరకలు పడ్డాయి. సుశాంత్ సింగ్ కేసులో భాగంగా బాలీవుడ్ డ్రగ్స్ లింకులు బయటపట్టాడు. అదే సమయంలో బెంగళూరులోని డ్రగ్స్ రాకెట్ బయటపడింది. అందులో ముఖ్యంగా హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజనా గల్రానీలను హస్తం ఉందని, ఆ ఇద్దరి అరెస్ట్ చేశారు. అక్కడితోనే వ్యవహారం అయిపోలేదు.
కేవలం డ్రగ్స్ కేసు వరకు పరిమితం అనుకున్న ఈ కేసులో వారి ఫోన్లను పరిశీలిస్తే సంచనల నిజాలు బయటకు వచ్చాయి. వీరు సెక్స్ రాకెట్‌ను కూడా నడుపుతున్నట్టు బయటపడింది. సినీ అవకాశాలు అంతగా లేని సంజనాకు అంత పెద్ద మొత్తంలో ప్రాపర్టీలు ఉండటం ఏంటనే కోణంలోనూ పోలీసులు విచారణ జరిపారు. అయితే ఎట్టకేలకు సంజనా గల్రానీకి బెయిల్ మంజూరైంది. ఈ మేరకు సంజనా గల్రానీకి కాస్త ఊపరి పీల్చుకున్నట్టైంది.

బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) సెప్టెంబర్ 8న డ్రగ్స్ కేసులో భాగంగా సంజనా గల్రానీని అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు మరికొంత మందిని కూడా అదుపులోకీ తీసుకున్నారు. అందులో రాగిణి ద్వివేదీ, నియాజ్, రవి, శంకర్, రాహుల్, వీరేన్ ఖన్నా, లూమ్ పెప్పర్, ప్రతీక్ శెట్టి వంటి వారిని విచారించారు. అయితే ఇందులో ఇప్పుడు సంజనాకు మాత్రం బెయిల్ లభించింది. ఆరోగ్యం సరిగా లేదని చెప్పడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన తరువాతే బెయిల్ మంజూరు చేశారు.


Click it and Unblock the Notifications











