డ్రగ్స్ వివాదంలోకి లాగడం దారుణం.. సంజన గల్రానీ ఆవేదన

కన్నడ పరిశ్రమలో డ్రగ్ రాకెట్ కేసులో సంజనా గల్రానీ పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. తన సహాయకుడు, రాఖీ బ్రదర్ రాహుల్‌ను విచారణకు హాజరుకావాలంటూ కర్ణాటక సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సమన్లు పంపించడం కన్నడ సినీ పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో సంజనాకు కూడా సమన్లు జారీ చేశారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

దీంతో మీడియాలో కథనాలు, ఊహాగానాలు ఎక్కువ కావడంతో సంజన ఓ ప్రకటను విడుదల చేశారు. మీడియా ప్రతినిధులు నాకు పదే పదే ఫోన్ చేస్తున్నారు. డ్రగ్ రాకెట్ గురించి నన్ను పలు ప్రశ్నలు వేసి సమాచారం కోసం ఆరా తీస్తున్నారు. అందుకే నేను మీడియాకు దూరంగా ఉంటున్నాను. అంతేగానీ భయపడి కాదు. నేను చీప్ పబ్లిసిటీకి దూరం. మీడియాలో ఎప్పుడూ కనిపించను. ఇప్పుడు కూడా అంతే. ఇందులోకి నన్న లాగడం దారుణం అంటూ అని తన ప్రకటనలో తెలిపారు.

 Sanjjanaa Galrani Released press note amid Summons rumours

కన్నడ సినీ పరిశ్రమలో డ్రగ్స్ మాఫియా లింకులను బయటపెట్టేందుకు అధికారులకు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నట్టు కనిపిస్తున్నాయి. డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నట్టు పలువురు సినీ తారల విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ సంజనా గల్రానీ అసిస్టెంట్‌ను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేయడం సంచలనం రేపింది. ఈ ఘటన తర్వాత సంజనకు పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉందనే మాట బలంగా వినిపిస్తున్నది. కన్నడ పరిశ్రమలో డ్రగ్స్ సంబంధాలపై ప్రముఖులను ఎన్సీబీ ప్రశ్నిస్తున్నది. దర్శకుడు ఇంద్రజిత్ లంకేష్‌ను బుధవారం విచారించారు. హీరోయిన్ రాగిణికి సమన్లు జారీ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X