మరో ప్రయోగంతో సంకల్ప్ రెడ్డి.. అధ్యయనం పూర్తి!
ఘాజి చిత్రంతో దర్శకుడు సంకల్ప్ రెడ్డి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఘాజి చిత్ర తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదలై విజయాన్ని అందుకుంది. ఆ చిత్రం అందించిన స్పూర్తితో రిస్క్ అయినా కూడా అంతరిక్ష పరిశోధన నేపథ్యంలో వరుణ్ తేజ్ తో అంతరిక్షం చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందించలేకపోయింది. అయినా కూడా సంకల్ప్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. విభిన్నమైన, యూనివర్సల్ కథలతోనే సినిమాలు రూపొందించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తాజాగా సంకల్ప్ రెడీ మంచు ఖండం అంటార్కిటికా నేపథ్యంలో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. అంతరిక్షం చిత్రం పూర్తి కాగానే సంకల్ప్ అంటార్కిటికాపై అధ్యయనం మొదలు పెట్టాడు. తన కథకు అవసరమైన సమాచారాన్ని సంకల్ప్ పూర్తిగా సేకరించినట్లు తెలుస్తోంది. అంటార్కిటికాలో జరిగే పరిశోధన నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతోందట.

అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలనే ఈ చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. సంకల్ప్ రెడ్డి తెరకెక్కించిన ఘాజి చిత్రం జాతీయ అవార్డు సొంతం చేసుకుంది. అంతరిక్షం చిత్రానికి కూడా ప్రశంసలు లభించాయి కానీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు.


Click it and Unblock the Notifications











