Sankarabharanam ఎడిటర్ జీజీ కృష్ణారావు కన్నుమూత..దాసరి, విశ్వనాథ్, బాపు, జంధ్యాల చిత్రాలకు.. !
ప్రపంచ స్థాయిలో తెలుగు, విదేశీ సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్న శంకరాభరణం లాంటి అద్బుత చిత్రానికి ఎడిటర్‌గా పనిచేసిన శ్రీ జీజీ కృష్ణారావు ఇక లేరు. వృద్దాప్య సంబంధిత వ్యాధులతో అనారోగ్యానికి గురైన ఆయన బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జీజీ కృష్ణారావు వయసు 87 సంవత్సరాలు. ఆయన మరణవార్తతో సినీ వర్గాలు, స్నేహితుల, సన్నిహితులు, సినీ అభిమానులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు.
తెలుగు, భారతీయ సినిమాలకు ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకొన్నారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ.. శ్రద్దాంజలి ఘటించారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి మనోధైర్యం, ఆయన ఆత్మకు శాంతిని కలుగజేయాలని భగవంతుడిని కోరుకొన్నారు. జీజీ కృష్ణారావు ప్రొఫెషనల్ జీవితంలోకి వెళ్తే..
తెలుగు సినిమా ప్రపంచంలో దిగ్గజ సినీ నిర్మాణ సంస్థలు పూర్ణోదయ, విజయమాధవి నిర్మించిన పలు చిత్రాలకు ఆయన పనిచేశారు. సినీ దిగ్గజ దర్శకులు దాసరి నారాయణ రావు, కే విశ్వనాథ్, బాపు, జంధ్యాల లాంటి ఉత్తమ ఫిల్మ్ మేకర్స్‌తో పనిచేశారు. ఆయన 200 పైగా చిత్రాలకు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

శంకరాభరణం, సాగరసంగమం, స్వాతిముత్యం, శుభలేఖ, బొబ్బిలి, సర్దార్ పాపారాయుడు, సూత్రధారులు, సీతామహలక్ష్మీ, శృతిలయలు, ముద్దమందారం, నాలుగు స్తంభాలాట, సిరివెన్నెల, శుభలేఖ, శుభ సంకల్పం, స్వరాభిషేకం, శ్రీరామరాజ్యం లాంటి ఎన్నో మరుపురాని చిత్రాలకు, చరిత్రలో నిలిచిపోయే చిత్రాలకు జీజీ కృష్ణారావు ఎడిటర్‌గా వ్యవహరించడం గొప్ప విషయం.
జీజీ కృష్ణారావు మృతికి సినీ ప్రముఖులు, జర్నలిస్టులు, సినీ అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేశారు. సినిమా పరిశ్రమకు ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకొంటున్నారు. గొప్ప ఎడిటర్‌గా ఆయన లేని లోటును ఎవరూ పూడ్చలేరని తమ సంతాపం ప్రకటనలో తెలియజేశారు.


Click it and Unblock the Notifications











