రాత్రి 9 దాటితే నా వల్ల కాదు .. కే విశ్వనాథ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ చరిత్రలో కళాతపస్విగా గుర్తింపు తెచ్చుకున్న కే. విశ్వనాథ్ ఎన్నో కళాఖండాలను తెలుగువారికి అందించారు. ఆయన సినిమాల్లో నటించిన నటీనటులు కూడా అంతే ఖ్యాతిని, గుర్తింపు తెచ్చుకున్నారు రాజ్యలక్ష్మీ. హీరోయిన్‌గా, సహాయనటిగా ఆమె దక్షిణాదిలోని అన్ని భాషల్లో నటించారు. ప్రస్తుతం అందరు సీనియర్ నటుల మాదిరిగానే రాజ్యలక్ష్మీ కూడా సీరియల్స్ బాట పట్టారు.

18 డిసెంబర్ 1964లో గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు రాజ్యలక్ష్మీ. స్థానికంగానే చదువుకున్న ఆమెను తల్లి నటిగా చూడాలని ఆశపడ్డారట. ఎందుకంటే రాజ్యలక్ష్మీ తల్లి ఓ డ్రామా ట్రూప్‌లో సభ్యురాలు. ఎన్నో నాటకాలు వేసిన అనుభవం ఉందంట. దీంతో రాజ్యలక్ష్మీని తీసుకుని ఆమె మద్రాస్‌కు వచ్చి అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించగా.. తొలుత సినిమా పిచ్చోళ్లు అనే మూవీలో సెకండ్ హీరోయిన్ ఆఫర్ వచ్చిందట. కానీ దీనిని రాజ్యలక్ష్మీ తల్లి తిరస్కరించారట.

sankarabharanam rajya Lakshmi made sensational comments on serial shooting timings

అనంతరం ఓ రోజున కూతురిని వెంటబెట్టుకుని కళాతపస్వి కే. విశ్వనాథ్‌ను కలిశారట. ఆయన కొన్ని సీన్స్ చెప్పి నటించమనగా అలాగే చేయడంతో విశ్వనాథ్‌కు అవి బాగా నచ్చడంతో వెంటనే శంకరభరణంలో ఛాన్స్ వచ్చిందట. ఇక ఈ సినిమా విడుదలై తెలుగునాట అపరూప దృశ్య కావ్యంగా నిలిచింది. శంకరభరణంలోని నటీనటులు చిత్ర సీమలో బాగా పాపులర్ అయ్యారు. అలా అమాయకంగా కనిపించే ముఖం, పెద్ద పెద్ద కళ్లు, అందమైన రూపంతో రాజ్యలక్ష్మీ అందరి కళ్లలో పడగా వరుస అవకాశాలు దక్కాయి.

అలా 1980 నుంచి 1990 వరకు దక్షిణాదిని ఒక ఊపారు రాజ్యలక్ష్మీ. కెరీర్ మంచి పీక్స్‌లో ఉండగానే 1990లో కేఆర్ కృష్ణన్ అనే వ్యక్తిని పెళ్లాడగా ఇద్దరు మగ పిల్లలు పుట్టారు. పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతల కారణంగా దాదాపు పదేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు. తిరిగి 2004లో మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అక్కడి నుంచి తల్లి, అక్క, వదిన పాత్రలతో రాజ్యలక్ష్మీ బిజీ అయ్యారు. ఈ ఏడాది శ్రీ విష్ణు నటించిన స్వాగ్‌లోనూ ఆమె తన నటనతో అలరించారు.

sankarabharanam rajya Lakshmi made sensational comments on serial shooting timings

సినిమాలలో నటిస్తూనే బుల్లితెరపైనా రాజ్యలక్ష్మీ అడుగుపెట్టారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన పలు సీరియల్స్‌లో ఆమె నటిస్తున్నారు. ప్రస్తుతం సన్ టీవీలో తమిళంలో ప్రసారమవుతున్న అన్నం సీరియల్స్‌లో రాజ్యలక్ష్మీ నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ తెలుగు ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజ్యలక్ష్మీ సినిమాలు, సీరియల్స్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. నా టైమ్ 9 టూ 9 అన్నట్లుగానే ఉందని.. 9 తర్వాత ఒక్క క్షణం కూడా తాను షూటింగ్ స్పాట్‌లో ఉండనని చెప్పారు.

ఏదైనా సీరియల్ కోసం తనను ఎవరైనా సంప్రదిస్తే తాను ఈ విషయాన్ని ముందే చెబుతానని .. ఇష్టమైతేనే బుక్ చేసుకోమ్మని కూడా చెబుతానని రాజ్యలక్ష్మీ తెలిపారు. 9 టూ 9 వర్క్ చేయాలంటే ఉదయాన్నే తాను 6 గంటలకి నిద్రలేచి 7.30 కల్లా సెట్‌కు రావాలని.. మళ్లీ నైట్ 9 గంటల తర్వాత ఇంటికెళ్లి మేకప్ తీసి, తిని పడుకునేసరికి ఎంత టైం అవుతుంది అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం రాజ్యలక్ష్మీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X