Sankranthi 2024: సంక్రాంతి బరిలో ఉన్న సినిమాల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే..?

ఏవైనా పెద్ద పండుగలు వస్తున్నాయంటే అనేక సినిమాలు విడుదలకు సిద్ధం అవుతుంటాయి. ప్రతీ శుక్రవారం లేదా పండుగల సమయాల్లో ఎక్కువ మొత్తం చిత్రాలు వస్తుంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పెద్ద పండుగ అయిన సంక్రాంతి బరిలో అనేక సినిమాలు ఉన్నాయి. కేవలం మూడు రోజుల్లోనే మొత్తం ఆరు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే ఆ సినిమాలు ఏవో , ఏయో రోజు వస్తున్నాయో అందరికీ తెలుసు. కానీ ఆ చిత్రాలు ఎంత మేర కలెక్షన్లు వసూళ్లు చేస్తే ఆ సినిమాలు హిట్టుగా నిలుస్తాయనేది మాత్రం ఎవరికీ తెలియదు. అయితే ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

2024 సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగులోనే నాలుగు చిత్రాలు విడుదల కాబోతున్నాయి. అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రాబోతున్న గుంటూరు కారం సినిమా జనవరి 12వ తేదీన విడుదల కాబోతుంది. 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లుగా నటిస్తుండగా.. నాగవంశీ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ చిత్రం మొత్తం రూ.135 కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తే బ్రేక్ ఈవెన్ సాధించినట్లు.

Sankranthi 2024 Movies Telugu Version Worldwide Breakeven Numbers Check Details

తేజ సజ్జ హీరోగా.. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న హనుమాన్ సినిమాను ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తేజ సజ్జ సరసన అమృత అయ్యర్ నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. జనవరి 12వ తేదీన ఈ సినిమా తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో విడుదల కాబోతుంది. అయితే ఈ చిత్రం రూ.25 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫిక్స్ అయింది.

Sankranthi 2024 Movies Telugu Version Worldwide Breakeven Numbers Check Details

విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రాబోతున్న సినిమా సైంధవ్ ను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మింస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ తో పాటు రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, నవాజుద్దీన్ సిద్దిఖీ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. అయితే ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్బంగా 2024 జనవరి 13న విడుదల చేస్తున్నారు. అయితే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 25 కోట్లుగా ఫిక్స్ అయింది.

Sankranthi 2024 Movies Telugu Version Worldwide Breakeven Numbers Check Details

నాగార్జున హీరోగా ఆశికా రంగనాథ్ హీరోయినా గా విజయ్ బిన్ని దర్శకత్వంలో రాబోతున్న సినిమానే నా సామి రంగ. ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ లు ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాను ముందుగా జనవరి 24వ తేదీన రిలీజ్ చేయాలని భావించినప్పటికీ.. జనవరి 14వ తేదీన విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18 కోట్ల రూపాయలుగా ఫిక్స్ అయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X