Sankranthi ki Vasthunam Trailer Review: సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ రివ్యూ.. మహేష్ కామెంట్స్ ట్రెండింగ్
విక్టరీ వెంకటేశ్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. పూర్తిగా వినోదభరితంగా యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా సంక్రాంతికి కానుకగా గ్రాండ్‌గా జనవరి 14 తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ క్రమంలో ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని దిల్ రాజు తన సొంత పట్టణం నిజమాబాద్‌లో భారీగా నిర్వహించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులు మీదుగా రిలీజైన ఈ ట్రైలర్ ఎలా ఉందనే వివరాల్లోకి వెళితే..
విక్టరీ వెంకటేశ్ మూవీ ట్రైలర్‌ను మహేష్ రిలీజ్ అభిమానుల్లో ఆసక్తిని, అంచనాలు పెంచాడు. సోషల్ మీడియాలో ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం ట్వీట్ చేశారు. ట్రైలర్ చూస్తే తప్పకుండా భారీ హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తున్నది. మా పెద్దోడు వెంకీ మామ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. అనిల్ రావిపూడికి నా అభినందనలు అని మహేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భాగమైన ప్రతీ ఒక్కరికి ఈ సినిమా విజయం చిరకాలం గుర్తుండిపోయేలా.. మెమొరబుల్ సంక్రాంతిగా కావాలని కోరుకొంటున్నాను. జనవరి 14వ తేదీన ఈ సినిమా చూడటానికి ఆసక్తిగా నేను ఎదురు చూస్తున్నాను అని మహేశ్ బాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. సంక్రాంతి పండుగ సమయంలో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ఎలాంటి సినిమా కావాలో అలాంటి సినిమాను అందించే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తున్నది. ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు మాదిరిగా రొమాంటిక్, కామెడీ, యాక్షన్ అంశాలను జొప్పించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారనే విషయం స్పష్టమైంది. ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరీ, వెంకటేశ్ మధ్య కెమిస్ట్రీ హిలేరియస్‌గా ఉందనే ఫీలింగ్ ట్రైలర్ కల్పించింది.

నీవు చక్కని చుక్క.. అది ఎండిపోయిన నక్క అంటూ.. ఎదుటి ఆడవాళ్లను తిడితే మరో మహిళకు ఎంత ఆనందమో అంటూ వెంకటేశ్ తనదైన శైలిలో చెప్పిన డైలాగ్స్ బాగున్నాయి. అలాగే ప్రతీ సినిమా రిలీజ్‌కు ముందు టీజర్ ఉన్నట్టే.. ప్రతీ మగాడికి పెళ్లికి ముందు ఓ లవర్ ఉంటుంది. దయచేసి ఆ విషయాన్ని నీ పెళ్లాంకు చెప్పకండి అనే డైలాగ్స్ కథను చెప్పకనే చెప్పే ప్రయత్నం చేశారు.
ఇక ట్రైలర్ ముగింపులో హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌తో వచ్చిన ప్రతీసారి విక్టరీనే అంటూ సింబాలిక్ సక్సెస్ కొట్టబోతున్నామనే కాన్ఫిడెన్స్‌ను చెప్పేందుకు ప్రయత్నించారు. సంక్రాంతి పండుగ ఈ సినిమా చిత్ర యూనిట్‌కు మెమొరబుల్‌గా మారుతుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











