మా నాన్నకు రెండో పెళ్లి చేస్తా.. బ్యూటీ కోసం బుల్లి రాజు వేట

సంక్రాంతికి వస్తున్నాం.. చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా బుల్లిరాజు ఫేమ్ అయిన సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేశ్ కు ఈ చిత్రంలో కొడుకు పాత్రలో నటించి మెప్పించాడు. కామెడీ వెర్షన్ ను చూపించి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఈ చిత్రంలో బుల్లిరాజుకు ఓ ఫేమస్ డైలాగ్ ఉంది. 'నాన్నోయ్.. పిన్ని వచ్చింది' అంటూ బుల్లిరాజు వెంకీకి హార్ట్ బ్రేక్ అయ్యే న్యూస్ చెప్పడాన్ని ఆడియెన్స్ తెగ ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే. అయితే బుల్లి రాజు ఇప్పుడు అదే డైలాగ్ ను నిజం చేయాలని చూస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

మా నాన్నకు పిన్ని కావాలని, 'లైలా'తో రెండో పెళ్లి చేస్తానంటూ తిరుగుతూ ఉన్న ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది.. బుల్లిరాజు ఎవరిని పిన్ని అంటున్నాడోనని.. ప్రేమికుల దినోత్సవం ఫిబ్రవరి 14న యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన 'లైలా' చిత్రం విడుదల కాబోతోంది. ఇందులో విశ్వక్ లేడీ గెటప్ తో ఫ్యాన్స్ ను, ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన పోస్టర్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

Sankranthiki Vasthunam child Artist Bulli Raju hunting for Laila

ఈ మూవీ గురించి మాట్లాడాల్సి వస్తే ఎక్కడా చూసినా విశ్వక్ సేన్ లేడీ గెటప్ నే హైలెట్ చేస్తున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూల్లోనూ, లైలా ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి కూడా 'లైలా' గురించి మాట్లాడారు. విశ్వక్ సేన్ లేడీ గెటప్ కు ఆ రేంజ్ హైప్ క్రియేట్ అయ్యింది. కాగా.. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్న సందర్భంగా.. బుల్లిరాజుతో 'మా నాన్నకు లైలా పిన్ని' కావాలంటూ ఓ ఫన్నీ వీడియోను క్రియేట్ చేశారు. విశ్వక్ సేన్, బుల్లిరాజు మధ్య సాగిన ఈ సన్నివేశం చాలా ఆకట్టుకుంటోంది. సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. బుల్లిరాజు తొలిచిత్రంతోనే చాలా క్రేజ్ సంపాదించుకోవడం విశేషం. అతనికి మరిన్ని పాత్రలు వస్తే మాత్రం ఇండస్ట్రీలో మంచి భవిష్యత్ ఉంటుంది.

మొన్నటి లైలా ఈవెంట్ లో జరిగిన ఘనటతో సోషల్ మీడియాలో బాయ్ కాట్ లైలా నినాదం వచ్చిన విషయం తెలిసిందే. దానిపై విశ్వక్, నిర్మాత క్లారిటీ ఇచ్చారు. తమ తప్పేమీ లేదని, అయినా తమ ఈవెంట్ లో జరగడంతో సారీ చెప్పి తమ సినిమాకు సహకరించాలని కోరారు. అట్నుంచి 'లైలా' చిత్రాన్ని మరింత జోరుగా ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పాటలు, టీజర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఇక రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. చివరిగా విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ చిత్రాలతో అలరించారు. ఇవన్నీ గతేడాదే రిలీజ్ అయ్యాయి.

More from Filmibeat

Read more about: bulli raju laila vishwak sen
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X