మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో సందీప్‌కిషన్.. సుబ్రహ్మణ్యపురం డైరెక్టర్‌తో..
టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకొన్న చిత్రం సుబ్రహ్మణ్యపురం. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సంతోష్ జాగర్లపూడి తన ప్రతిభను రుజువు చేసుకోవడమే కాకుండా అభిరుచి ఉన్న డైరెక్టర్‌గా పేరు తెచ్చుకొన్నారు. ప్రస్తుతం యువ హీరో సందీప్‌కిషన్‌తో సంతోష్ జాగర్లపూడి సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సుబ్రహ్మణ్యపురం చిత్రంతో అభిరుచి గల నిర్మాత పేరుపొందిన బీరం సుధాకర్ రెడ్డి, కార్తీకేయ చిత్రంతో నిర్మాతగా అందరి ప్రశంసలు అందుకున్న వెంకట శ్రీనివాస్ బొగ్గరమ్‌లు సుధాకర్ ఇంప్లెక్స్ ఐపీఎల్ అండ్ టారస్ సినీ కార్స్ పతాకాలపై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాలను తెలియజేస్తూ సుబ్రహ్మణ్యపురం దర్శకుడు సంతోష్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. క్రీడా నేపథ్యంలో కొనసాగే కథ ఇది. అత్యంత ప్రాచీనమైన ధనుర్విధ్యలో ప్రధాన ఆకర్షణ లక్ష్యాన్ని ఛేదించడం.అత్యంత కష్టమైన ఈ విద్య ద్వారా కథానాయకుడు తన లక్ష్యాన్ని ఎలా ఛేదించాడు అనేది చిత్ర కథ. వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని తెలిపారు.



Click it and Unblock the Notifications











