నిర్మాతలని దారుణంగా అవమానిస్తూ.. వైరల్ అవుతున్న సినిమాటోగ్రాఫర్ ట్వీట్!
ఇండియాలో ఉన్న దిగ్గజ సినిమాట్రోగ్రాఫర్స్ లో సంతోష్ శివన్ కూడా ఒకరు. అనేక ఉత్తమ అవార్డులు ఆయన్ని వరించాయి. ఆయన సినిమాట్రోగ్రఫీలో అనే అద్భుత చిత్రాలు తెరకెక్కాయి. తాజగా సంతోష్ శివన్ వివాదంలో చిక్కుకున్నారు. నిర్మాతలని అవమానిస్తూ ఆయన చేసిన ట్వీట్ తీవ్ర వివాదంగా మారుతోంది.
హీరోయిన్లతో పోల్చుకుంటే రెమ్యునరేషన్ విషయంలో సాంకేతిక నిపుణులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని సంతోష్ శివన్ భావిస్తున్నారు. సాంకేతిక నిపుణులకు రెమ్యునరేషన్ ఇచ్చే సమయంలో నిర్మాతలు అంటూ కోపంగా ఉన్న శునకం ఫోటోని, హీరోయిన్లకు డబ్బులు ఇచ్చే సమయంలో నిర్మాతలు అంటూ ప్రశాంతంగా ఉన్న కుక్క ఫోటోని పోస్ట్ చేసారు. దీనితో నిర్మాతలంతా సంతోష్ శివన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

అతడిపై చర్యలు తీసుకునేందుకు నేడు నిర్మాతల మండలి సమావేశం కానుంది. సంతోష్ శివన్ ఆ ట్వీట్ ని డిలీట్ చేసిన నెటిజన్లు వైరల్ చేయడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది.


Click it and Unblock the Notifications











