For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అనుకున్నట్లే తండ్రి లేని ఆ కుర్ర హీరో జీవితాన్నే మార్చేసిన ప్రభాస్.. ఒక్క హిట్టుతో ఎన్ని సినిమాలో..

  |

  టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఇప్పుడు మామూలుగా లేదు. అగ్ర దర్శకులు బడా హీరోలు అతని డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే స్థాయి ఎంత పెరిగినా కూడా డార్లింగ్ తన ఎదుగుదలకు సహాయం చేసిన వారిని ఎన్నడూ మరచిపోడు. ఇటీవల తండ్రి లేని యువ హీరోకు అండగా నిలబడి అతని కెరీర్ ను సక్సెస్ లో పెట్టాడు. తెలిసిన వాళ్ళకు తెలియని వాళ్ళకు అతని గురించి చెప్పి ఒక ట్రాక్ అయితే సెట్ చేశాడు.

   కాన్ఫిడెన్స్ కోల్పోకుండా కష్టపడ్డాడు

  కాన్ఫిడెన్స్ కోల్పోకుండా కష్టపడ్డాడు

  ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ఎంతగానో క్రేజ్ అందుకుంటున్నాడు. అయితే కెరీర్ మొదట్లో మొదటి సక్సెస్ కోసం అతను చాలా కాలం వేయిట్ చేయాల్సి వచ్చింది. అతని మొదటి సినిమాలో నటనపై కూడా కొంత విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ ప్రభాస్ తన కాన్ఫిడెన్స్ కోల్పోకుండా కష్టపడ్డాడు. కానీ మొదటి రెండు సినిమాలు ఈశ్వర్, రాఘవేంద్ర దారుణంగా ప్లాప్ అయ్యాయి.

   ఆ దర్శకుడు చనిపోవడంతో

  ఆ దర్శకుడు చనిపోవడంతో

  ఇక అలాంటి సమయంలో దర్శకుడు శోభన్ వర్షం కథ కోసం ప్రభాస్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్ కు శోభన్ కు మంచి స్నేహం ఏర్పడింది. విలన్ గా నటించిన గోపీచంద్ కూడా ఆ సినిమాతోనే క్లోజ్ అయ్యాడు. అయితే శోభన్ 2008లో గుండెపోటుతో మరణించడంతో అతని కుటుంబం ఒక్కసారిగా అనాధగా మారిపోయింది.

   యూవీ క్రియేషన్స్ ద్వారా

  యూవీ క్రియేషన్స్ ద్వారా

  ఆ కష్ట సమయంలో ప్రభాస్ వారికి అండగా ఉంటూ వస్తున్నాడు. ఇక సంతోష్ శోభన్ సొంతంగా అవకాశాలు అందుకుంటూ కెరీర్ మొదట్లో కొన్ని సినిమాలు చేశాడు. పేపర్ బాయ్, తను నేను అనే సినిమాలు కూడా చేశాడు. కానీ అవేవి కూడా అంతగా క్లిక్కవ్వలేదు. ఇక సంతోష్ శోభన్ పై ప్రభాస్ గత రెండేళ్లుగా స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. యూవీ క్రియేషన్స్ ద్వారా అతని కోసం కథలు సెట్ చేయించాడు.

   ప్రభాస్ నమ్మకాన్ని నిజం చేసింది.

  ప్రభాస్ నమ్మకాన్ని నిజం చేసింది.

  ఇక యూవీ కాన్సెప్ట్స్ అనే కొత్త బ్యానర్ ను స్థాపించి అందులో ఏక్ మీని కథ అనే బోల్డ్ సినిమాను నిర్మించిన యూవీ క్రియేషన్స్ మొత్తానికి ప్రభాస్ నమ్మకాన్ని నిజం చేసింది. సంతోష్ శోభన్ నటించిన ఏక్ మినీ కథ థియేటర్స్ లో విడుదల కాకపోయినప్పటికి అమెజాన్ ప్రైమ్ లో మంచి డీల్ తో నిర్మాతలకు ప్రాఫిట్స్ ను అందించింది.

  Prabhas Radhe Shyam బిజినెస్ స్ట్రాటజీ.. Radhe బాటలో ? || Filmibeat Telugu
   ఆఫర్స్ క్యూ కట్టాయి

  ఆఫర్స్ క్యూ కట్టాయి

  ఏక్ మినీ కథ హిట్టవ్వడంతో సంతోష్ శోభన్ కు ఆఫర్స్ క్యూ కట్టాయి. వైజయంతి ప్రొడక్షన్ అనుబంధ సంస్థ స్వప్న సినిమాస్ లో హీరోగా మరొక ఛాన్స్ కొట్టేశాడు. ఆ సినిమాకు నందిని రెడ్డి డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం. అలాగే సీతారా ఎంటర్టైన్మెంట్స్ లో కూడా ఒక సినిమా చర్చల్లో ఉంది. అలాగే ప్రభాస్ మైత్రి మూవీ మేకర్స్ తో కూడా మాట్లాడినట్లు సమాచారం. ఏదేమైనా ప్రభాస్ వర్షం దర్శకుడి కొడుకును ఒక ట్రాక్ లో పెట్టి అతని ఋణాన్ని తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

  English summary
  Offers queued up for Santosh Shobhan as Ek Mini story hit. Vyjayanti Production affiliate Swapna Cinemas hit another chance as a hero. Information that Nandini Reddy is going to direct the movie. Also a movie in Sithara Entertainments is in discussions. It is learned that Prabhas has also spoken to Maitri Movie Makers. However, Prabhas Varsham is trying to pay off the director's son by putting him on a track.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X