ఏక్ మినీ కథ ట్రైలర్: డ్రాయర్‌లో ఒక డౌట్.. వామ్మో బోల్డ్ కంటెంట్ మాములుగా లేదు!

బోల్డ్ వెబ్ కంటెంట్ లకు ఎప్పుడైనా సరే డిమాండ్ గట్టిగానే ఉంటుంది. ఓటీటీ హడావుడి ఎక్కువైన తరువాత డోస్ ఇంకాస్త పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా తెలుగులో కూడా అలాంటి కథలు ఎక్కువవుతున్నాయనే చెప్పాలి. ఇక యూవీ సంస్థ నుంచి పుట్టుకొచ్చిన యూవీ కాన్సెప్ట్స్ ద్వారా త్వరలోనే ఏక్ మినీ కథ అనే మరో బోల్డ్ కంటెంట్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

వర్షం సదర్శకుడి మరణం తరువాత

వర్షం సదర్శకుడి మరణం తరువాత

వర్షం సినిమా దర్శకుడు శోభన్ మరణించిన అనంతరం అతని కొడుకు సంతోష్ శోభన్ హీరోగా సక్సెస్ అవ్వాలని ప్రయత్నాలు చాలానే చేస్తున్నాడు. అతని సపోర్ట్ గా ప్రభాస్ కూడా యూవీ క్రియేషన్స్ ద్వారా మంచి మంచి అవకాశాలు ఇప్పిస్తున్నాడు. ఇప్పుడు ఏక్ మినీ కథ అనే కాన్సెప్ట్ తో హిట్టు కొట్టడానికి రెడీ అయ్యాడు.

నా డ్రాయర్ లో ఒక డౌట్

నా డ్రాయర్ లో ఒక డౌట్

అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయగా బోల్డ్ కంటెంట్ డోస్ గట్టిగానే ఉన్నట్లు అర్ధమవుతోంది. పురుషాంగం చిన్నదిగా ఉందని బాధ పడే హీరో పాత్రను చాలా కామెడీగా ప్రజెంట్ చేశారు. నాన్న నా డ్రాయర్ లో ఒక డౌట్ ఉందని అంటూ బ్రహ్మాజీతో వచ్చే కామెడీ సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.

ఆ అమ్మాయితో ఎలా కనెక్ట్ అయ్యాడు

ఇక సుదర్శన్ - సంతోష్ మధ్యలో వచ్చే కామెడీ సన్నివేశాలు కూడా హైలెట్ అయ్యేలా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కటి తన జీవితంలో చిన్నదే అంటూ బాధ పడే హీరోకు.. భిన్నమైన హీరోయిన్ ఎదురవుతుంది. ప్రతి ఒక్కటీ పెద్దగా ఉండాలని ఇష్టపడే ఆ అమ్మాయితో ఎలా కనెక్ట్ అయ్యాడు అనే పాయింట్ ఆసక్తికరంగా ఉంది. మేకపర్ల గాంధీ ఈ కాన్సెప్ట్ కు కథను అందించగా యువ దర్శకుడు కార్తిక్ రాపోలు తెరకెక్కించాడు.

అమెజాన్ ప్రైమ్ లో విడుదల

అమెజాన్ ప్రైమ్ లో విడుదల

సుదర్శన్, బ్రహ్మాజీ, పోసాని కృష్ణమురళి, సప్తగిరి వంటి స్టార్ క్యాస్ట్ ఉన్నటువంటి ఈ సినిమాను మొదట థియేటర్స్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సెకండ్ వేవ్ వల్ల డైరెక్ట్ గా ఓటీటీ విడుదలకు సిద్ధమయ్యారు. అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 27న విడుదల కాబోతోంది. మరి ఈ సినిమాతో అయినా సంతోష్ శోభన్ హిట్ టాక్ ను అందుకుంటాడో లేదో చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X