For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

    సెన్సేషనల్ టైటిల్‌తో సప్తగిరి.. కొత్త సినిమా పేరు తెలిస్తే షాకవ్వాల్సిందే..

    |

    స్టార్ కమెడియన్‌గా రాణిస్తూ సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్‌ఎల్‌బీ చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ రూట్‌ని ఏర్పరుచుకున్నారు సప్తగిరి. ఆయన హీరోగా సప్తగిరి ఎక్స్‌ప్రెస్ తెరకెక్కించిన దర్శకుడు అరుణ్ పవార్ డైరెక్షన్‌లో శివ శివమ్ ఫిలింస్ పతాకంపై నరేంద్ర, జీవిఎన్ రెడ్డి ఓ చిత్రాన్నినిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి వజ్ర కవచధర గోవింద అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

    కథకు సరిపడే టైటిల్ అని

    కథకు సరిపడే టైటిల్ అని

    ఈ సందర్భంగా దర్శకుడు అరుణ్ పవార్ మాట్లాడుతూ.. ఈ కథకు కరెక్ట్ టైటిల్ ఇది. ఇందులో సప్తగిరి పాత్ర పేరు గోవిందు. ఇతనొక ఫన్నీ దొంగ. ఇతనికో లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధన కోసం అతనేం చేశాడన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం.

    మీ చేతుల్లో సినీ తారల ప్రతిష్ఠ.. ఉత్తమ నటీనటులను, దర్శకులకు ఓటేయండి..

    సప్తగిరి బాడీ లాంగ్వేజ్‌కు సూటయ్యే

    సప్తగిరి బాడీ లాంగ్వేజ్‌కు సూటయ్యే

    కడుపుబ్బా నవ్వించే అంశాలతోపాటు, మంచి యాక్షన్, ఎమోషన్, ఇతర వాణిజ్య అంశాలు కూడా ఇందులో బాగా కుదిరాయి. సప్తగిరి బాడీ లాంగ్వేజ్‌కి పర్‌ఫెక్ట్‌గా సూటయ్యే కథ ఇది అని చెప్పారు.

    ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా

    ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా

    నిర్మాతలు నరేంద్ర, జీవిఎన్ రెడ్డి మాట్లాడుతూ.. సప్తగిరి ఎక్స్‌ప్రెస్ లాంటి సూపర్ హిట్ తర్వాత సప్తగిరి, అరుణ్ పవార్ కాంబినేషన్‌లో సినిమా చేసే అవకాశం మాకు దక్కడం చాలా హ్యాపీగా ఉంది. ఇందొక హిలేరియస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. ఇప్పటికి 60 శాతం చిత్రం పూర్తయింది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం అని తెలిపారు.

    నటీనటులు, సాంకేతిక వర్గం

    నటీనటులు, సాంకేతిక వర్గం

    వైభవీ జోషీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అర్చనా వేద, టెంపర్ వంశీ, అప్పారావు, అవినాష్, రాజేంద్ర జాన్ కొట్టోలి, వీరేన్ తంబిదొరై తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్ారు. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, కెమెరా: వనమాలి, ఎడిటింగ్: కిషోర్ మద్దాలి. నిర్మాతలు: నరేంద్ర, జీవీఎన్ రెడ్డి, దర్శకత్వం: అరుణ్ పవార్.

    English summary
    Once again Director Arun Pawar, Saptagiri joins hands together after Saptagiri Express. Now they working a news Action entertainer. This project title is confirmed as Vajra Kavachdhara Govinda. Narendra, GVN Reddy are the producers. Vaibhavi joshi is the heroine.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more