వజ్రకవచధార ట్రైలర్ రివ్యూ: చివరి సిగరెట్టు.. లాస్ట్ పెగ్గు అనే మాటను.. నమ్మినట్టు చరిత్రలోనే లేదు
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, సప్తగిరి ఎల్ఎల్‌బీ సినిమాల తర్వాత మరో మంచి కథా చిత్రంతో సప్తగిరి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శివ శివమ్ ఫిలిమ్స్ పతాకంపై అరుణ్ పవార్ దర్శకత్వంలో నరేంద్ర యెడల, జీవీఎన్ రెడ్డి నిర్మాతలుగా సప్తగిరి నటించిన వజ్రకవచధర గోవిందా చిత్రం జూన్ 14న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
భయంలో దయ్యాన్ని, పూనకంలో దేవుడ్ని చూస్తారు. నీవు వేసే వేషం కూడా ప్రజల్ని నమ్మించాలనే డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ట్రైలర్‌లోని విజువల్స్‌లో క్వాలిటీ కనిపించింది. హ్యాస్యానికి పెద్ద పీట వేస్తూనే ఎమోషనల్ సీన్లకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్టు ఫీలింగ్ కలిగింది.
వజ్రాలు, రత్నాల వేట కోసం సప్తగిరి, అతని టీమ్ ప్రయత్నాలు చేసినట్టు కొన్ని సీన్లు కనిపించాయి. గుహల్లో చిత్రీకరించిన సీన్లు బాగున్నాయి. అన్ని రకాల ఎమోషన్స్‌ను సినిమాలో జొప్పించినట్టు ట్రైలర్ ఓ ఫీలింగ్ కలిగిస్తున్నది.
చివర్లో ఇదే చివరి సిగరెట్టు.. లాస్ట్ పెగ్గు అని చెప్పిన మగాడి మాట.. ఇదే చివరి షాపింగ్ అని లేడీస్ చెప్పిన మాటలను జనాలు నమ్మినట్టు చరిత్రలో లేదు అంటూ సప్తగిరి చెప్పిన డైలాగ్ క్యాచీగా ఉంది.

మూవీ: వజ్ర కవచధార గోవింద
సప్తగిరి, వైభవి జోషి, అర్చన, టెంపర్ వంశీ తదితరులు
బ్యానర్: శివశివమ్ ఫిల్మ్స్
సంగీతం: బుల్గానియన్
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి
దర్శకత్వం: అరుణ్ పవార్
ఎడిటర్: కిషోర్ మద్దాలి
డీవోపీ: ప్రవీణ్ వనమాలి


Click it and Unblock the Notifications











