twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరోనా క్రైసిస్ ఛారిటీ.. సప్తగిరి ఆర్థిక సాయం ఎంతంటే..?

    |

    కమెడియన్‌గా ప్రస్థానం మొదలు పెట్టిన సప్తగిరి.. హీరోగా రాణించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. హీరోగా కామెడీ చిత్రాలను ట్రై చేసినా అంతగా వర్కౌట్ కాలేదు. అయినా సరే వచ్చిన ప్రతీ అవకాశాన్ని వాడుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండటంలో మన దేశంలో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ కమ్రంలోనే సినీ కార్మికులను ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీని చిరంజీవి ప్రారంభించాడు.

    లాక్ డౌన్ నేపథ్యంలో పని దొరక్క అల్లాడుతున్న సినీ శ్రామికులకు అండగా ఉండేందుకు చిరంజీవి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటిస్తూ.. కరోనా క్రైసిస్ ఛారిటీని స్థాపించాడు. చిరు పిలుపు మేరకు టాలీవుడ్ అంతా కదిలి వస్తూ ఎవరికి తోచిన సాయాన్ని వారు చేస్తున్నారు. ఈ క్రమంలో నాగార్జున కోటి, దగ్గుబాటి ఫ్యామిలీ కోటి, ప్రభాస్ 50 లక్షలు, ఎన్టీఆర్ 25 లక్షలు, రామ్ చరణ్ 30 లక్షలు, మహేష్ బాబు 25 లక్షల సాయాన్ని ప్రకటించారు.

    Sapthagiri Donates two Lakh To Corona Crisis Charity

    కేవలం హీరోలు మాత్రమే కాకుండా.. దర్శకులు కూడా తమ వంతు సాయాన్ని ప్రకటించారు. సంపూర్ణేశ్ బాబు, వెన్నెల కిషోర్ వంటి వారు కూడా చేతనైనా సాయాన్ని ప్రకటించారు. తాజాగా సప్తగిరి సైతం ఓ చేయి వేశాడు. సినీ కార్మికుల కోసం కరోనా క్రైసిస్ ఛారిటీకి రెండు లక్షల విరాళాన్ని ప్రకటించాడు.

    English summary
    Sapthagiri Donates two Lakh To Corona Crisis Charity, WHich Is Initiated By Chiranjeevi. Tollywood celebraties Donating Fund To CCC. Among All Sapathgiri Also Joined.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X