ఆ హీరోతో డేటింగ్‌కు వెళ్లాలని ఉంది.. సైఫ్ ఖాన్ ముద్దుల కూతురు మనసులో మాట..
బాలీవుడ్‌లో అడుగుపెట్టకముందే సారా అలీఖాన్ హడావిడి చేసేస్తొంది. ఆమె నటించిన కేదారినాథ్ చిత్రం రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఇటీవల ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహర్ షోకు హాజరైంది. ఈ కార్యక్రమంలో ఎవరితో డేటింగ్‌కు వెళ్లాలని అనుకొంటున్నావు అని సారాను కరణ్ ఓ ప్రశ్న అడిగాడు.
కరణ్ ప్రశ్నకు సమాధానమిస్తూ.. నాకు కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్‌కు వెళ్లాలని ఉంది అని అన్నారు. ఇటీవల విజయం సాధించిన సోను కి టిటూ కి స్వీటి అనే చిత్రంలో హీరోగా నటించిన సంగతి తెలిసిందే.

సారా డేటింగ్ వెళ్లాలని అనుకుంటున్నదని ఇటీవల జరిగిన మీడియా ప్రెస్‌మీట్‌లో కార్తీక్ ఆర్యన్‌ను ప్రశ్నించగా.. అందులో ఏముందని సమాధానం ఇచ్చాడు. నాకు సారా ఆలీ ఖాన్‌ను డేటింగ్‌పై కాఫీ కోసం తీసుకెళ్తాను. నాకు ఆమెతో కాఫీ తాగడం కంటే సంతోషమేముంటుందని తెలివిగా కార్తీక్ ఆర్యన్ సమాధానం ఇచ్చాడు.
ఇదిలా ఉండగా, సోను కి టిటూ కి స్వీటి చిత్రాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో రీమేక్ చేయాలని అనుకొంటున్నట్టు ఓ వార్త ప్రచారంలో ఉంది. మాటల మాంత్రికుడు జవాబిస్తే తప్ప అందులో వాస్తవమేంతో తెలియడం ఖాయం.


Click it and Unblock the Notifications











