ప్రభాస్‌, విజయ్‌లను వెన‌క్కి నెట్టిన ధురంధర్ బ్యూటీ ! ఇండియాలో టాప్ ఆమెనే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), తమిళ సూపర్ స్టార్ విజయ్ (Vijay)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా వీరిద్దరికీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అసాధారణమైనది. విజయ్ తన చివరి సినిమాగా ప్రకటించిన 'జన నాయకన్' ఆడియో లాంచ్‌ను మలేషియాలో గ్రాండ్‌గా నిర్వహిస్తే, ప్రభాస్ 'బాహుబలి' సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. సాలర్ , కల్కీ వంటి సినిమాలతో ప్రభాస్ మార్కెట్ మరింత పెరిగింది. అయితే.. ఇలాంటి స్టార్ హీరోలను కూడా వెనక్కి నెట్టి, ఒక్కసారిగా ఇండియా టాప్‌లో నిలిచిన ఓ యువ నటి ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.ఇంతకీ ఆ నటి ఎవరు? అసలేం జరిగిందంటే?

ఆమె ఎవరో కాదు... ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్, నేటి సంచలన నటి సారా అర్జున్ (Sara Arjun). ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రముఖ సినిమా డేటాబేస్ వెబ్‌సైట్ ఐఎండీబీ(IMDb) తాజాగా విడుదల చేసిన వీక్లీ ' పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్' జాబితాలో యువ నటి సారా అర్జున్ (Sara Arjun) అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. గత వారం రెండో స్థానంలో ఉన్న సారా, ఈ వారం నేరుగా టాప్‌కు చేరడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Sara Arjun Tops IMDb List Beats Prabhas and Vijay with Dhurandhar Blockbuster

యంగ్ హీరోయిన్ సారా అర్జున్ టాప్ ఫ్లేస్ లో నిలవడానికి ప్రధాన కారణం ఆమె లెటేస్ట్ మూవీ ధురంధర్(Dhurandhar). ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో ఆమె పోషించిన 'యాలినా' పాత్రకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన లభించింది. ఈ సినిమాలో రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా, ఆదిత్య ధార్ (Aditya Dhar) దర్శకత్వంలో తెరకెక్కింది. అంతగా అంచనాలేని ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది. భారత్‌లోనే రూ. 800 కోట్లకు పైగా నెట్ వసూళ్లు సాధించి, హిందీ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు చేసిన సినిమా సరికొత్త రికార్డు చేసింది. ఈ భారీ విజయం సారా పాపులారిటీని అమాంతం పెంచింది.

పాన్ ఇండియా స్టార్లకు షాక్...
ఈ వారం ఐఎండీబీ లిస్ట్‌లో సారా అర్జున్‌తో పాటు దర్శకుడు ఆదిత్య ధర్ రెండో స్థానంలో నిలిచారు. పాన్ ఇండియా స్టార్స్ అయిన విజయ దళపతి (Vijay) ఎవరూ ఊహించని విధంగా 8 వ స్థానంలో నిలువగా, పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) 19 వ స్థానంలో నిలిచారు. ఇలా స్టార్ హీరోలను వెనక్కి నెట్టి సారా అగ్రస్థానంలో నిలవడం విశేషం.

ఇక ఈ జాబితాలో అగస్త్య నంద 12 వ స్థానంలో , భాగ్యశ్రీ బోర్ 15వ స్థానంలో యామీ గౌతమ్ 17వ స్థానంలో నిలిచారు. విజయ్ తన రాజకీయ ప్రవేశానికి ముందు చివరి చిత్రంగా ప్రకటించిన 'జన నాయకన్'పై ఆసక్తి ఉన్నప్పటికీ, సెన్సార్ సమస్యలతో రిలీజ్ వాయిదా పడడం ర్యాంక్‌పై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభాస్ విషయంలో 'ది రాజా సాబ్'పై అంచనాలు ఉన్నా, ఈ వారం సారా క్రేజ్ ముందు వెనుకబడ్డారు.

ఐఎండీబీ (IMDb)ఇండియా అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ లిస్ట్‌ను ప్రకటించింది. ప్రేక్షకుల ఆసక్తి, లెటెస్ట్ ప్రాజెక్టులు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ల ప్రభావం ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ ప్రతివారం మారుతుంటాయి. ఈ వారం లిస్ట్ భారతీయ సినిమా వైవిధ్యాన్ని, అలాగే డిజిటల్-థియేట్రికల్ కంటెంట్ ప్రభావాన్ని స్పష్టంగా చూపిస్తోందని సినీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు పొందిన సారా అర్జున్, 'ధురంధర్' ఘనవిజయంతో గ్లోబల్ ట్రెండింగ్ సెలబ్రిటీగా అవతరించింది. ఐఎండీబీ (IMDb)పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్‌లో నంబర్ వన్ స్థానం ఆమె కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలిచింది. ప్రభాస్‌, విజయ్‌లాంటి పాన్ ఇండియా స్టార్లను కూడా వెనక్కి నెట్టిన ఈ ఘనత సాధించడంతో రాబోయే రోజుల్లో సారా అర్జున్ ఎలాంటి ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు వస్తుందోనన్నది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X